
ఆటో డ్రైవర్ లకు ప్రత్యేక సూచనలు, సరైన రికార్డులు లేకుండా మరియు నిబంధనలు పాటించని వారిపైన చట్టపరమైన చర్యలు.. ఎన్.విక్రమ్, ఇన్స్పెక్టర్, నగరి.
నగరి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటో డ్రైవర్ లకు ప్రత్యేక సూచనలు, సరైన రికార్డులు లేకుండా మరియు నిబంధనలు పాటించని వారిపైన చట్టపరమైన చర్యలు.. ఎన్.విక్రమ్, ఇన్స్పెక్టర్, నగరి.చిత్తూరు జిల్లా యస్. పి. మణికంఠ చందోలు, ఐ. పి. యస్ ఆదేశాల మేరకు, నగరి డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్ పర్యవేక్షణ లో ..
12 ఏప్రిల్ 2025 శనివారం నగరి పట్టణంలో పోలీస్ అర్బన్ స్టేషన్ నందు, నగరి,
సత్రవాడ, ముడిపల్లి, నాగలాపురం, నాగరాజకుప్పం, మాంగాడు రూట్లలో ఆటో నడుపుతున్న ఆటో డ్రైవర్ లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.
రోడ్ భద్రత, రికార్డు లు కలిగి ఉండటం మరియు ఆటో నడపటం మొదలగు వాటిపైన క్రింద కనబరచిన ప్రత్యేక సూచనలు చేయడం జరిగింది.
*ఆటో నడిపే వ్యక్తి ఖచ్చితంగా యూనిపామ్ దరించి ఆటో నడపాలి.
*ప్రతి ఒక్కరు డ్రైవిoగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, ఎఫ్. సి మరియు ఇతర డాక్యుమెంట్లు కలిగి వుండాలి.
*మద్యం సేవించి గాని, సెల్ మాట్లాడుతూ గాని ఆటో నడపరాదు.
*అతివేగంగా అజాగ్రత్తగా ఆటో నడపరాదు.
*ఆటో నందు అధికంగా శబ్దం వచ్చే లౌడ్ స్పీకెర్ పెట్టకూడదు.
*ఆటో నందు పరిదికి మించి జనాలను ఎక్కించుకొని వెళ్ళరాదు.
*ఆటోను ఎక్కడ బడితే అక్కడ పార్కింగ్ చేయడం చేయకూడదు.
*ఏకాంబరకుప్పం రైల్వే గేట్ మరియు సత్రవాడ వద్ద రోడ్ పైన వాహనాలు నిలుపరాదు.
*నిబంధనలు పాటించకపోతే మోటార్ వాహనాల చట్టం మేరకు చర్య తీసుకోబడును.
*ట్రాఫిక్ నియంత్రణ మరియు రోడ్ ప్రమాదాల నివారణ లో పోలీస్ వారికి సహకరించవలసింది గా కోరడమైనది.