logo

హనుమాన్ జయంతోత్సవ సంబరాలు-




కుబీర్ మండల కేంద్రంలోని చిన్న హనుమాన్ ఆలయంలో ఈరోజు అంగరంగ వైభవంగా హనుమాన్ దినోత్సవ వేడుకలు బ్రహ్మణోత్తముల మధ్య, మంత్రోచ్ఛరణలతో జరిగాయి. ప్రతి సంవత్సరం చైత్రమాసం శుక్లపక్ష పౌర్ణమి రోజున శ్రీ ఆంజనేయస్వామి జన్మోత్సవ కార్యక్రమాలు, గౌరీ గణపతి పూజ, పుణ్యహ వాచనము, మరియు నవగ్రహ, సర్వత్రోభద్ర మండపం పూజ మరియు హోమము పలు దంపతుల సమక్షంలో పూజారి కార్యక్రమాలు పురోహితులు ప్రమోద్ జోషి, సాయి ప్రసాద్ జ్యోషి జరిపించారు. తదనంతరం తీర్థ ప్రసాదాలు, అన్నదానము జరిపారు. ఈ కార్యక్రమంలో గురు స్వామి పుప్పాల పీరాజి,సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ డాక్టర్ సాప పండరి, బచ్చు వార్ రమేష్, తగిలిపెల్లి ప్రదీప్, దేవరశెట్టి శ్రీనివాస్, రేడిశెట్టి సంతోష్, నిఖిల్, సంతోష్ పటేల్, డాక్టర్ ఠాగూర్ దత్తు సింగ్, పోగుల లింగన్న కోల్సిక్ వార్ సతీష్, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

23
2987 views