రేషన్ కోసం తొమ్మిది రోజుల పడిగాపులు - ఇబ్బందులు పడ్డ పేద ప్రజలు
రేషన్ కోసం తొమ్మిది రోజుల పడిగాపులు - ఇబ్బందులు పడ్డ పేద ప్రజలు
ఈనెల చౌక ధరల దుకాణాలలో పంపిణీ చేసే రేషన్ బియ్యం కోసం ఈనెల పేదలు తొమ్మిది రోజులు పడిగాపులు కాశారు. ప్రతి నెల 1వ తారీకు నుండే పంచాల్సిన బియ్యం బుగ్గారం మండలంలో మాత్రం 9వ తేదీ నుండి పంపిణీ ప్రారంభం చేశారు. ఈ నెల 8న గంగాపూర్ లో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేతుల మీదుగా సన్న బియ్యం పంపిణీ ప్రారంభోత్సవం చేశారు. మరుసటి రోజు నుండి అన్ని గ్రామాలలో పంపిణీ చేశారు. ఆలస్యంతో పేదలు తినడానికి బియ్యం అందక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.