గేట్ వసూలు
రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని టౌన్ గేట్ మరియు బస్టాండ్ గెట్ వేలం పాట 8.4.2025 వేయడం జరిగింది. గత ప్రభుత్వంలో మున్సిపల్ పాలకవర్గం ఏకపక్షంగా వ్యాపారస్తులకు మరియు రైతులకు కొండంత అండగా నిలిచారు. కరోనా లాంటి విపత్తుల పరిస్థితుల్లో వారి కష్టాలు చూసి టౌన్ గేట్ మరియు బస్టాండ్ గెట్ నామినల్ పద్ధతిలో పురపాలక సంఘానికి డబ్బులు చెల్లించి ప్రజలపై ఎటువంటి గేటు వసూలు లేకుండా చేయడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారస్తులకు, రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్న సమయంలో కూటమి ప్రభుత్వం రైతులు వ్యాపారస్తుల తోపుడుబండ్ల పై వ్యాపారం చేసుకునే వారిపై ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. నిన్న జరిగిన టౌన్ గేట్ మరియు బస్టాండ్ గెట్ వేలం పాటకు మున్సిపల్ అధికారులు కూడా ఏకపక్షంగా వ్యవహరించి ఇతరులు ఎవరు కూడా ఓపెన్ టెండర్ లో పాల్గొనకుండా ఇబ్బంది కలిగించి ఏకపక్షంగా ఒకరికే కట్టబెట్టడం జరిగింది. ఈ సమావేశంలో మునిసిపల్ చైర్మన్ ఫయాజ్ భాష, కౌన్సిలర్ ఈశ్వర్ ప్రసాద్, సుగావాసి శ్యాం పాల్గొన్నారు