నందిపేట్ వాసికి గౌరవ డాక్టరేట్-
నిజామాబాద్ జిల్లా నందిపేట్ లంక రజనీష్ కు శ్రమకు తగ్గ ఫలితం దక్కింది. శనివారం తమిళనాడు లోని హోసూర్ లో ఆసియా ఇంటర్నేషనల్ కల్చర్ రీసెర్చ్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో డా. కరాటే ఏపీ శ్రీనాథ్, ఆంధ్రప్రదేశ్ మాజీ విశ్రాంత న్యాయమూర్తి డా. జె. హరిదాస్, శ్రీ శ్రీ శ్రీ ఆదిత్య స్వామీజీ, డా. ఎస్. గుణశేఖరన్, డా. డి. దైవ సిగమణి, డా. రవిచంద్రన్ స్వామీజీ, డా. అరుణ్ చిన్న దురై చేతుల మీదుగా ఎంతో ప్రతీష్టాత్కమైనా, అరుదైన గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్బంగా రజనీష్ మాట్లాడుతూ తాను ఎన్నో కష్టాలు పడి ఉన్నత చదువులు చదివి అనేక రంగాల్లో సేవలు అందించి, భౌతిక శాస్త్ర విభాగంలో అధ్యాపకులుగా విధులు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రస్తుతం "ఫోటో టెక్నాలజీ ఓల్టాయిక్ రీసెర్చ్ డయోడ్ " అనే అంశం పైన నేడు ఇంతటి గొప్ప డాక్టరేట్ రావడం చాలా అనందంగా ఉందన్నారు. నాకు ఈ అవకాశం రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున కృతజ్ఞతలు అని అన్నారు.