logo

జాతీయస్థాయి పోటీల్లో ప్రథమ బహుమతి పొందిన కంచరాం ఉన్నత పాఠశాల భౌతిక శాస్త్ర ఉపాధ్యాయుడు పండూరు వేణుగోపాల్ బృందం

సైన్స్ ఫోటో కి జాతీయ స్థాయి పోటీ లలో ప్రథమ బహుమతి : ఫౌండేషన్ ఫర్ అడ్వాన్సిoగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ,ఇండియా(FAST india) వారి ఆధ్వర్యం లో జనవరి నెల 11, 12 తేదీలలో, Fergusson collage, పూణే లో జరగిన "నేషనల్ సైన్స్ ఫిస్టవల్ " లో, "సైన్స్ ఇన్ ఫోకస్" ఫోటో ప్రదర్శనలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కంచరాం భౌతిక శాస్త్ర ఉపాద్యాయుడు పండూరు వేణుగోపాల్ తీసిన " ఒకే ఫ్రేమ్( ఫోటో) లో బహుళ కాంతి ధర్మాలు" అనే ఫోటో ప్రదర్శించడం జరిగింది. ఈ ఒకే ఒక్క ఫోటో లో కాంతి కి సంభందించిన సమతల దర్పణం లో కాంతి క్రమ పరావర్తనం, కుంభాకార దర్పణం, పుటాకార దర్పణం లో కాంతి అక్రమ పరావర్తనం, కటకాలలో కాంతి వక్రీభవనం, కాంతి సంపూర్ణాంతర పరావర్తనం,కాంతి విక్షేపణం, కాంతి వివర్తనం వంటి పది ధర్మాలను చూపించడం జరిగింది. గతం లో పేటెంట్ పొందిన "బహుళ సమాంతర కాంతి కిరణాలను ఉత్పత్తి చేసే పరికరం" మరియు సాధారణ సెల్ ఫోన్ సహాయం తో ఈ ఫోటో తియ్యడం జరిగింది. వందలాది సైన్స్ ఫోటో లు పోటీ పడగా కేవలం 30 సైన్స్ ఫోటో లను మాత్రమే జాతీయ స్థాయి ప్రదర్శనకు ఎంపిక చేసారు.ఈ ప్రదర్శన లో పండూరు వేణుగోపాల్ తీసిన సైన్స్ ఫోటో కి ప్రథమ బహుమతి వచ్చింది అని నిర్వాహకులు ఈమెయిల్ ద్వారా తెలియ చేసారు.సర్టిఫికెట్, తో పాటు ₹30,000 నగదును బహుమతిగా అందచేస్తారని నిర్వాహకులు తెలియచేసారు. జాతీయ స్థాయి సైన్స్ ఫోటో ప్రదర్శన లో ప్రథమ బహుమతి పొందిన సందర్భం గా భౌతిక శాస్త్ర ఉపాద్యాయుడు పండూరు వేణుగోపాల్ ను,ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాద్యాయులు వి వి వసంత కుమార్ గారు ,ఇతర ఉపాద్యాయులు ,కంచరాం గ్రామ ప్రజలు అభినందించారు

262
13529 views