logo

కాంగ్రెస్ ఆధ్వర్యంలో ముస్లీం సోదరులకు ఇఫ్తార్ విందు ఏర్పాటులో పాల్గొన్న ఎమ్మెల్యే

పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, డెస్క్ : పిట్లం మండలకేంద్రంలో రంజాన్ పవిత్రమాసంను పురస్కరించుకుని ముస్లీం సోదరులకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం మండల కేంద్రంలోని భారత్ ఫంక్షన్ హాల్ లో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు ముఖ్య అథితిగా పాల్గొన్నారు. ఆయన ముస్లీం సోదరులకు అల్పాహారాన్ని అందించి రంజాన్ పవిత్రమాసం నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేపట్టి, ద్కెవ నామస్మరణలో గడపడం దెవం పట్ల తమకు ఉన్న భక్తిని చాటి చెప్తుందని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, ముస్లీం సోదరులు, మతపెద్దలు తదితరులు పాల్గొన్నారు.

8
295 views