logo

నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు. రాజీవ్ యువ వికాసం పథకం సద్వినియోగపరచుకోండి.. ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాగి ఉపేందర్ రావు.

కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా షెడ్యూల్డు కులముల సేవా సహకార అభివృద్ధి సంఘం లిమిటెడ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని షెడ్యూల్డు కులాలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు తద్వారా ఆర్ధిక పురోగతి పెంపొందిచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన రాజీవ్ యువ వికాసం పథకం ప్రకటించింది.వయస్సు 21-55 సం,,లు కల అభ్యర్థులు ఉపాధి హామీ పథకాలకు 21-60 సం,,లు కల అభ్యర్థులు భూసంబంధ, ఉద్యానవన, వ్యవసాయ పరికరాల పథకాలకు దరఖాస్తు చేసుకొనగలరు. అభ్యర్థి సంవత్సర ఆదాయం (గ్రామీణ ప్రాంతాల వారికి రూ. 1,50,000/- లు పట్టణ/ మున్సిపాలిటీ (ప్రాంతాల వారికి రూ.2,00,000/- లు మించి ఉండరాదు. మీ-సేవ నుండి పొందిన కులం ఒక సంవత్సరం లోపు ఆదాయ ధృవపత్రం, ఆధార్ కార్డ్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ కలిగిన దారిద్ర రేఖకు దిగువన కల అభ్యర్థులు దరఖాస్తు చేసుకొనగలరు. కావున అర్హత ఆసక్తి కల అభ్యర్ధులు టీజీవో బి ఎం ఎస్ ఆన్లైన్ పోర్టల్ https://tgobmms.cgg.gov.in ద్వారా దరఖాస్తు నమోదు చేసుకొని దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని, హార్డ్ కాపీని అవసరమైన పత్రాలను జత పరిచి మండల ప్రజాపాలన సేవా కేంద్రం (గ్రామీణ ప్రాంతాలలో ఎంపీడీవో కార్యాలయం) లేదా మున్సిపల్ కమిషనర్ / జోనల్ కమిషనర్ కార్యాలయం (పట్టణ ప్రాంతాలు)లో సమర్పించాలి. ఈ నమోదు ప్రక్రియ ది.05 ఏప్రిల్ 2025 వరకు అందుబాటులో ఉంటుంది. మరిన్ని వివరాల కొరకు జిల్లాలోని ఎస్.సి కార్పోరేషన్ కార్యాలయం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, రూమ్ నం. ఎస్1, రెండవ అంతస్తు, సమీకృత జిల్లా ఆఫీసుల కార్యాలయము ఐ డి ఓ సి , నవభారత్, పాల్వంచ మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నందు ఇతర వివరములకు 9849905990 నందు సంప్రదించగలరని రాగి ఉపేందర్ రావు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.సి. కార్పోరేషన్ భద్రాద్రి కొత్తగూడెం వారు ఒక ప్రకటనలో తెలియజేసినారు.

33
1314 views