logo

కొత్తగూడెంలో అందరి సహకారంతో ఆరోగ్య సభలు విజయవంతం తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు, మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంఘం వెంకట పుల్లయ్య కు ఘన సన్మానం

కొత్తగూడెం: ప్రకృతి ఆశ్రమ ఆధ్వర్యంలో కొత్తగూడెంలో నిర్వహించిన ఆరోగ్య మహాసభలు అందరి సహకారంతో విజయవంతం అయ్యాయని నిర్వాహకులు పేర్కొన్నారు. గురువారం రాత్రి బస్టాండ్ సమీపంలో ఆశ్రమ సర్వసభ్య సమావేశం జరిగింది. సభలనువిజయవంతం చేసినందుకు ప్రకృతి ప్రేమికులకు, పర్యావరణ పరిరక్షకులకు, ఆరోగ్యాభిలాషులకు అభినందనలు తెలియజేశారు.
ప్రత్యేకించి మీడియా వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రకృతి ఆరోగ్యం పైన పర్యావరణ పరిరక్షణ పైన కలెక్టర్ జితేష్ వి పాటిల్ అందించిన స్ఫూర్తితో మరింత ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. మహాసభల విజయవంతానికి ఆర్థికంగా, హార్దికంగా సహాయ సహకారాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందించిన వారందరికీ పేరు పేరునా అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆశ్రమం ముఖ్య సలహాదారు, తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ (ఎం వి ఐ)సంగం వెంకట పుల్లయ్య ను ఘనంగా సత్కరించి సన్మానించారు.
సింగరేణి రిటైర్డ్ జిఎం శనగ వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, మొక్కల వెంకటయ్య, డాక్టర్ బి కృష్ణయ్య, సింగరేణి ఏజీఎం గోనే శ్రీకాంత్, మన్ కీ బాత్ మొక్కల రాజశేఖర్, కో-ఆర్డినేటర్ సుగుణా రావు, బంగారు శంకర్, దయానంద సాగర్, రాజేంద్రప్రసాద్, తుంపూడి శివ రగణబాబులు పాల్గొన్నారు.

6
825 views