logo

ఏజెన్సీ ప్రాంతాల లోని ఎస్టి, బలహీన వర్గాలకు నా కంఠంలో ఊపిరి ఉన్నంతవరకు అండగా ఉంటా *బిజెపి, బిజెఏఎంసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు

తెలంగాణ స్టేట్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం మార్చి 28


ఏజెన్సీ ప్రాంతాల లోని ఎస్టి, బలహీన వర్గాలకు నా కంఠంలో ఊపిరి ఉన్నంతవరకు అండగా ఉంటా

*బిజెపి, బిజెఏఎంసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు,

* శనివారం(29/03/2035) నాడు సుమారు 3000 మందితో జాతీయ రాష్ట్ర ముఖ్య నేతలు సమావేశం,


* హాజరుకానున్న బిజెపి బిజెఎంసి జాతీయ ప్రధాన కార్యదర్శి ఎస్ పవార్,

* స్థానిక సంస్థల ఎన్నికల పై కార్యకర్తలకు దిశా నిర్దేశం,


చండ్రుగొండ, మార్చి 28: (ఏఐఎంఏ మీడియా )
ఏజెన్సీ ప్రాంతాలలో ఉన్న ఎస్టి ఎస్సి బడుగు బలహీన వర్గాల నిరుపేదలకు స్వతంత్రం వచ్చి ఎనిమిదవ దశాబ్దం నడుస్తున్న వారికి ఇప్పటికీ కనీస అవసరాలు తీరేంతవరకు తన ప్రాణం ఉన్నంతవరకు వారి కొరకు ఎన్నో సందర్భాల్లో రాష్ట్రo నుండి కేంద్రం వరకు పోరాటం చేసి అయినా నిరుపేదల పక్షాన నిలబడతామని బిజెపి, బిజెఎంసి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మద్దిశెట్టి సామేలు అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని దామరచర్ల గ్రామంలోని ఎస్ఆర్ గార్డెన్ లో ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఏజెన్సీ లో ఉన్న నిరుపేదల కనీస అవసరాలు ఇండ్లు, రేషన్ కార్డులు, మంచినీటి సౌకర్యం, గిరిజన గ్రామాలకు బీటి, సిసి రోడ్లు, గిరిజన మహిళ పూజారులకు వేతనాలు, గిరిజన దేవాలయాలకు దీప దూప నైవేద్యాలు కోసం నిధులు మంజూరు చేయాలని బిజెపి బిజెఎంసి ఆధ్వర్యంలో గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వాలపై నిరంత పోరాటాలు నిర్వహించడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం గుర్తించి వెంటనే ఏజెన్సీ లో ఉన్న నిరుపేదలకు కనీస సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వానికి ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగిందన్నారు. అలాగే భారత రాష్ట్రపతి కూడా తమ సమస్యలను సానుకూలంగా విని రాష్ట్ర ప్రభుత్వానికి సమస్యలు పరిష్కరించాలని లిఖితపూర్వకంగా ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. అయినా కూడా గత ప్రభుత్వం ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏజెన్సీలో ఉన్న నిరుపేదలను పట్టించుకోవడం లేదన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గిరిజనులకు న్యాయం జరిగేంత వరకు తమ పోరాటాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయన్నారు. అందులో భాగంగానే నేడు దామరచర్ల గ్రామంలోని ఎస్ఆర్ గార్డెన్ లో ఖమ్మం, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 39 మండలాల నుంచి మండలానికి 100 మంది చొప్పున 4000 మందితో భారీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ సమావేశానికి ముందు చండ్రుగొండ ప్రధాన సెంటర్ నుండి అయ్యన్నపాలెం సర్కిల్ నుంచి దామరచర్ల లోని ఎస్ఆర్ గార్డెన్ వరకు భారీ ప్రదర్శన ఉంటుందన్నారు. ఈ సమావేశంలో ఏజెన్సీలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయంపై చర్చించి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడమే మా ప్రధాన ఉద్దేశం అని అదేవిధంగా ఏప్రిల్ 3న ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను కలవనున్నట్లు ఆయన అపాయింట్మెంట్ తీసుకోవడం జరిగిందని వారితో కూడా పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లడం జరుగుతుందన్నారు. దాంతో పాటు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్డీఏ అలయన్స్ లో ఉన్న పార్టీలతో కలిసి స్థానిక సంస్థల్లో తమ అభ్యర్థులను నిలబెట్టే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా.. ఎస్ పవార్ బిజెపి బిజెఎంసి జాతీయ ప్రధాన కార్యదర్శి మరియు దక్షిణ భారత ఇన్చార్జ్, ధీరజ్ శర్మ జాతీయ అధ్యక్షుడు నేషనలిస్ట్ యూత్ కాంగ్రెస్ (ఎన్ సిపి) యష్ పా జాతీయ కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి (ఎన్.వై.సి ఎన్.సి.పి) పి.కె. నజేష్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి వర్కింగ్ కమిటీ సభ్యుడు ఎన్.సి.పి సునీల్ జాదవ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఎన్.సి.పి పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొణక రామదాసు, రాజులపాటి ఐలయ్య, ముక్తి మల్లేష్, కోడెం సీతాకుమారి, పైథా సోము, కుంజ నాగేంద్రబాబు, నిర్మల, తదితరులు పాల్గొన్నారు.

30
1036 views