logo

బొబ్బిలి ఎమ్మెల్యే బేబీనాయన గారుపై నిరాధార ఆరోపణలు చేస్తే తస్మాత్ జాగ్రత్త: కాగాన సునీల్ కుమార్


కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ హర్షకుమార్ గారు ఈరోజు బొబ్బిలి పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే శ్రీ బేబీనాయన గారుపై మరియు కూటమి ప్రభుత్వంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తున్నాను.

హర్షకుమార్ గారు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని సూచిస్తూ, మీరు మాట్లాడిన భూసమస్య న్యాయస్థానం నందు ఉన్నందున దానిపై లోతుగా చర్చించను.. ఎమ్మెల్యే బేబీనాయన గారి వకీలు ఈ భూమిని గురించి పూర్తి వివరాలు గతంలో మీడియా సమక్షంలో తెలిపిన విషయం బహుశా మీకు తెలియదేమో, మీడియా మిత్రులకు వాటి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. మీకు కావాలంటే ఒక కాపీ పంపిస్తాము ఒకసారి చదువుకోండి. గత ఐదు ఏళ్లలో అన్యాయాలకు మాత్రమే కొమ్ముకాసిన ఒక మీడియా ఛానల్ లోగో ముందుపెట్టుకుని మీకు నచ్చినట్లో లేదా ఎవరో చెప్పినట్లో మా ఎమ్మెల్యే గారు గురించి మాట్లాడితే మా నియోజకవర్గం ప్రజలు సహించరు.. అసలు మీరేంటో మీ కొడుకుల చరిత్ర ఎంతో అందరికీ తెలుసు, దెయ్యాలు వేదాలు వల్లించినట్లు మీరే మాట్లాడితే, శత్రువుకైనా సహాయం చేయడం మాత్రమే తెలిసిన మా ఎమ్మెల్యే బేబీ నాయన గారు గురించి మేము ఎంతైనా మాట్లాడగలం.. కాబట్టి, ఇంకెప్పుడు అసంపూర్తి సమాచారంతో మాట్లాడవద్దు అని మరో మారు హెచ్చరిస్తున్నాను.

ఇట్లు,
కాగాన సునీల్ కుమార్.
తెలుగు యువత పార్లమెంట్ కార్యదర్శి, విజయనగరం జిల్లా

18
795 views