logo

మలబార్ గోల్డ్ & డైమండ్స్ షోరూంను ప్రారంభించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్

నంద్యాల జిల్లా:
🇮🇳 స్థానిక శ్రీనివాస్ సెంటర్ నందు నూతనంగా ఏర్పాటు చేసిన మలబార్ గోల్డ్ & డైమండ్స్ షోరూమును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ ఆభరణాల వ్యాపారిగా ప్రఖ్యాతిగాంచిన మలబార్ గోల్డ్ & డైమండ్స్, తమ కొత్త షోరూమును నంద్యాల శ్రీనివాస్ నగర్ లో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు . 3,500 చదరపు అడుగుల విస్తీర్ణంలో అద్భుతంగా తీర్చిదిద్దిన ఈ కొత్త షోరూమ్, విభిన్న డిజైన్లు మరియు శైలులతో తయారుచేసిన అద్భుతమైన ఆభరణాల సేకరణలను అందిస్తూ, వినియోగదారులకు అంతర్జాతీయ స్థాయి షాపింగ్ అనుభూతిని అందిస్తుందని . ఈ శుభసందర్భంగా, 06వ ఏప్రిల్ 2025 తేదీ వరకు, ప్రత్యేక ఆఫర్లు అందిస్తుందని , వినియోగదారులు చేసిన ప్రతి కొనుగోలుపై, బంగారం బరువుకు సరిసమానమైన వెండి నాణెం ఉచితంగా అందుకుంటారన్నారు (షరతులు వర్తిస్తాయన్నారు) . భారతదేశంలో తమ ఉనికిని మరింత విస్తరించాలనే మలబార్ ప్రణాళికలకు అనుగుణంగా ప్రారంభించబడిన ఈ కొత్త షోరూమ్, తమ ప్రస్థానంలో మరొక ముందడుగును వేసిందన్నారు . నంద్యాలలో ప్రారంభించిన ఈ షోరూమ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మలబార్ బ్రాండ్ యొక్క 18 వ అవుట్లెట్, మరియు ఈ ప్రాంతంలో మలబార్ ఉనికిని మరియు నాయకత్వాన్ని మరింత బలోపేతం చేస్తుందనే మంత్రి ఫరూక్ తెలిపారు . అనంతరం వినియోగదారులు కొనుగోలు చేసిన బంగారు ఆభరణాలను మంత్రి ఫరూక్ గారి చేతుల మీదుగా కొనుగోలుదారులకు అందించడం జరిగింది.
🇮🇳ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు ఎన్ఎండి ఫయాజ్ , మేనేజ్మెంట్ & టీమ్ సభ్యులు, శ్రీ సిరాజ్ పికె , రిటైల్ హెడ్ రెస్ట్ అఫ్ ఇండియా మలబార్ గోల్డ్ & డైమండ్స్ నిఖిల్ చంద్రన్ , ఆంధ్రప్రదేశ్ జోనల్ హెడ్ మలబార్ గోల్డ్ & డైమండ్స్ ఫయిజ్ , మలబార్ గోల్డ్ & డైమండ్స్ కర్నూల్ షోరూం హెడ్ మాయీజ్ , మలబార్ గోల్డ్ & డైమండ్స్ నంద్యాల షోరూం హెడ్ వినియోగదారులు మరియు శ్రేయోభిలాషులు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

5
360 views