logo

అధికారం కోసం ఎగబడుతూ పేద ప్రజల ఆరోగ్యాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వ హాస్పిటల్స్ డాక్టర్స్: ఏఐటీయూసీ.

నంద్యాల రిపోర్టర్/ మోహన్ :
నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో గత వారం ఒక పత్రికలో వేసిన విధంగా, అడిషనల్ సూపర్డెంట్ హవా నడుస్తుందా? నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి GO ప్రకారము పోస్టు లేకున్నా అధికారం చలాయిస్తూ, ఉద్యోగులపై వేధింపులకు గురి చేస్తున్నారని, నేను చెప్పిందే వేదం, నేను చెప్పిన మాటే వినాలి. ఇది నా ఇష్టం అని చలామణి అవుతున్న నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి అడిషనల్ సూపర్డెంట్ హవా నడుస్తున్నదనే గుస గుసలు వినపడుతున్న ఇంకా హవా కొనసాగిస్తున్నారంటే, వీరి యొక్క ధైర్యం ఏంటని, వారికీ ఎవరి సపోర్ట్ ఉందని AITUC నంద్యాల పట్టణకార్యదర్శి డి శ్రీనివాసులు ప్రశ్నించారు.నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఆరోగ్యం, తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యము సరిగా లేదని, మాకు డ్యూటీ షిఫ్టులు మార్చమని మొరపెట్టుకున్నారు. అయినప్పటికీ కరుణించడం పోనించి,ఆరోగ్యం సరిగా లేకపోతే ఉద్యోగం మానుకోమనిహాస్పిటల్ సిబ్బందిని నర్సింగ్ సూపరిండెంట్,గ్రేడ్ వన్, గ్రేడ్ 2 ఆఫీసర్లు మరియు అధికారులు వేధింపులకు పాల్పడుతున్నారాని అన్నారు.నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల ఆరోగ్యం మెరుగు కోసం కంటే, రెగ్యులర్, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను హింసించడమే ధ్యేయంగా పెట్టుకుని పనిచేస్తున్న నర్సింగ్ సూపరిండెంట్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, మరి కొందరి రెగ్యులర్ స్టాఫ్ నర్స్ లపై ఎందుకు అధికారులు చర్యలు తీసుకోవడం లేదని వారు ప్రశ్నించారు.అసలు నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో రెగ్యులర్ సూపరింటెండెంట్ కంటే, పోస్ట్ శాంక్షన్ లేని అడిషనల్ సూపరింటెండెంట్ హవా నడుస్తుందా? రెగ్యులర్ సూపరింటెండెంట్ ఉన్నాడా? లేడా?అనే ప్రశ్నలు వస్తున్నాయన్నారు.అధికార పోటీతత్వం కోసం, పేద రోగులను గాలికి వదిలేసిన నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రి వైద్య అధికారులు, వారికీ వత్తాసు పలుకుతూ మిగతా క్రింది స్థాయి సిబ్బందిని ఇబ్బందులు పెడుతున్న అంశాలపై సమగ్ర విచారణ చేపట్టాలని AITUC నంద్యాల పట్టణ కార్యదర్శి డి శ్రీనివాసులు తెలిపారు. లేని పక్షం లో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు సిద్ధం అవుతామని వారు హెచ్చరించారు.

2
0 views