logo

ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. మీడియా టుడే మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్.


ప్రణాళికాబద్ధంగా ఏసంగి ధాన్యం కొనుగోలు కలెక్టర్

వరి కోతల ప్రకారం సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రారంభం

*నాణ్యమైన ధాన్యాన్ని చివరి గింజ వరకు మద్దతు ధరకు కొనుగోలు*

*తాలు లేకుండా శుభ్రపరిచిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలి కలెక్టర్*


*గన్ని బ్యాగులు, ప్యాడీ క్లీనర్, వెయింగ్ యంత్రాలు మొదలైన మౌళిక వసతులు కల్పించాలి**

*ధాన్యం తూకంలో పారదర్శకంగా ఉండాలి**

*గ్రేడ్ ఏ రకానికి రూ.2320**

*సాధారణ రకానికి రూ.2300*


**ఏప్రిల్ నుండి అవసరానికి తగ్గట్టుగా ధాన్యం కోనుగోలు కేంద్రాలు ప్రారంభించాలి*



*నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకుని వచ్చేలా చర్యలు*

*ధాన్యం కొనుగోలుపై అధికారులతో సమీక్షించిన జిల్లా కలెక్టర్*



యాసంగి 2024-25 వరి పంట కోనుగోలు నిమిత్తం ధాన్యము కొనుగోలు కేంద్రాలను ఏప్రిల్ మాసంలో అవసరానికి తగ్గట్టుగా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు.

గురువారం జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో
ఏర్పాటు చేసిన యాసంగీ ధాన్యం కొనుగోలు పై అదనపు కలెక్టర్ నగేష్ తో కలిసి సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.,
కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా తాగు నీరు, విద్యుత్ వసతి కల్పించాలని, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం వేసే యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు.
ధాన్యం తూకంలో పారదర్శకంగా ఉండాలని, నిర్దేశించిన విధంగా కొనుగోళ్లు చేయాలని సూచించారు. నిర్దేశించిన బరువుకంటే ఎక్కువ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయవద్దని ఆయన స్పష్టం చేశారు.

మద్దతు ధరకే విక్రయించాలి

రైతులు తాము కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని పిలుపు నిచ్చారు. రైతులు తమ ధాన్యాన్ని తాలు, తప్ప లేకుండా, తేమ శాతం 17 ఉండేలా చూసుకుని,నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూకేంద్రాలకు తరలించాలని సూచించారు. ప్రభుత్వం  గ్రేడ్ ఏ రకం ధాన్యానికి క్వింటాలుకు రూ.2320 , సాధారణ రకానికి రూ.2300 నిర్ణయించినందని వెల్లడించారు. నిబంధనల మేరకు రైతులు తమ ధాన్యాన్ని శుభ్రంగా తీసుకువచ్చి, మద్దతు ధర పొందాలని సూచించారు.

ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం

రబీ సీజన్ కోతలు మొదలవుతున్న దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలోని 21 మండలాల్లో ఏప్రిల్ మాసం నుండి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు తెలిపారు. . ధాన్యాన్ని సేకరించేందుకు 480 కేంద్రాలు ప్రారంభించనున్నట్లు వివరించారు.. రైతులకు టోకెన్లు ఇవ్వాలని, దాని ప్రకారం
కొనుగోళ్లు చేయాలని సూచించారు. , ధాన్యం కొనుగోలు చేసినప్పుడు రైతు ఐరిస్ కూడా తీసుకోవాలని సూచించారు. ఆయా కొనుగోలు కేంద్రాలకు కేటాయించిన రైస్ మిల్లులకు ధాన్యాన్ని తరలించాలని, రైతులకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా శాఖల అధికారులు కొనుగోళ్లు నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు.

అందుబాటులో పరికరాలు

జిల్లాలో అవసరం మేరకు అన్ని పరికరాలు అందుబాటులో ఉన్నాయని అదనపు కలెక్టర్ వెల్లడించారు.
టార్పాలిన్లు 14919, తూకం వేసే యంత్రాలు 700, ప్యాడీ క్లీనర్లు 500 తేమ శాతం చూసే మెషిన్లు 700 అందుబాటులో ఉన్నాయని తెలిపారు. జిల్లాలోని రైతులు వీటిని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ మద్దతు ధరకే ధాన్యాన్ని విక్రయించాలని అదనపు కలెక్టర్ సూచించారు.
జిల్లా వ్యవసాయ అధికారి , వినయ్
డి ఎం సివిల్ సప్లై జగదీష్ కుమార్, జిల్లా పౌరసరఫల అధికారి సురేష్ రెడ్డి, జిల్లా మార్కెటింగ్ అధికారి, యాదయ్య,డి.సి.ఒ , కరుణాకర్, లీగల్ మెట్రాలజీ అధికారి, సుధాకర్, ఆర్డీవోలు మెదక్ రమాదేవి, తూఫ్రాన్ జై చంద్ర రెడ్డి, నర్సాపూర్ మహిపాల్ రెడ్డి ఐకెపి, పిఎ సి.ఎస్, మార్కెట్ చైర్మన్లు, రైస్ మిల్లర్స్, అసోసియేషన్ రవాణా, శాఖ తదితరులు పాల్గొన్నారు.

0
174 views