అచ్చంపేట బార్ అసోసియేషన్ అధ్యకుడిగా సూర్యపల్లి మస్తాన్
జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా సీనియర్ న్యాయవాది సూర్యపల్లి మస్తాన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికల పక్రియలో భాగంగా అధ్యక్ష పదవికి ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఆయన ఎన్నికను సహచర న్యాయవాదులు ఆమోదించి.. ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా కె. వెంకటరమణ, ఉపాధ్యాక్షులుగా జి. సుధాకర్, కోశాధికారిగా జి. భాస్కర్ రెడ్డి, సహాయ కార్యదర్శిగా జి. మల్లేష్, లైబ్రేరియన్ ఎం.కృష్ణ, మహిళా ప్రతినిధిగా యస్. సరిత ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి జి.వెంకటేశ్వరరావు తెలిపారు.