
నందికొట్కూర్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా భోగినం నాగలింగమయ్య
నంద్యాల జిల్లా/ నందికొట్కూరు :
🇮🇳బీసీలను ఎస్సీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ప్రచార కార్యదర్శి వేంపెంట రాంబాబు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం నందికొట్కూరు నియోజకవర్గ కార్యదర్శిగా భోగినం నాగలింగమయ్యను నియమించినట్లు ఆయన ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారి వర్గాల బీసీ కులాల సంక్షేమ కోసం కొన్ని ఏళ్లుగా బీసీ సంక్షేమ సంఘం లో పనిచేస్తున్న నాగలింగమయ్యను నందికొట్కూరు నియోజకవర్గం బాధ్యతలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు. గ్రామ మండల స్థాయి నుంచి బీసీల అభ్యున్నతి కోసం చేసిన ఆయనను నియోజకవర్గ బాధ్యతలు అప్పగించడం జరిగిందని ఆయన తెలిపారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ ఆర్ ఎస్ ఆర్ గోపాల్ మాట్లాడుతూ బీసీల కులగణన చేపట్టాలని, బీసీలకు భద్రత ఏర్పాటు చేయాలని వారి హక్కుల కోసం సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా నాగమ్మ లింగమయ్య మాట్లాడుతూ అప్పగించిన బాధ్యతలను తప్పకుండా బాధ్యతరాతంగా నిర్వహిస్తానని తెలిపారు.
🇮🇳 ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం మండలం ప్రెసిడెంట్ ఆర్ మురళీమోహన్, మండల ప్రధాన కార్యదర్శి జాలా రామ్మోహన్, వర్కింగ్ ప్రెసిడెంట్ జాలా సురేష్ ఆయనకు అభినందనలు తెలిపారు.