logo

తాజా మాజీ సర్పంచ్ ల అరెస్టు - బుగ్గారం పోలీస్ స్టేషన్ లో నిర్భంధం

తాజా మాజీ సర్పంచ్ ల అరెస్టు

- బుగ్గారం పోలీస్ స్టేషన్ లో నిర్భంధం

బుగ్గారం / జగిత్యాల జిల్లా:

బుగ్గారం మండలంలోని తాజా మాజీ సర్పంచ్ లను, మహిళా సర్పంచ్ ల భర్తలను గురువారం పోలీసులు ముందస్తు అరెస్టు చేసి బుగ్గారం పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు.
పెండింగ్ బిల్లుల కోసం నిరసనలతో పాటు తాజా మాజీ సర్పంచ్ లు అసెంబ్లీని ముట్టడించ కుండా ఆపేందుకు పోలీసులు బుధవారం రాత్రి నుండే వీరిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా సర్పంచ్ పదవీ కాలంలో అప్పులు చేసి అభివృద్ధి పనులు చేశామని అన్నారు. అప్పులు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందని అన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి పెండింగ్ బిల్లులు మొత్తం చెల్లించి మమ్మల్ని ఆదుకోవాలని వారు కోరారు. శాంతి యుతంగా మా నిరసనలు తెలుపుతూ మా బిల్లులు చెల్లించాలని కోరితే అక్రమంగా అరెస్టు చేసి నిర్భంధించడం అన్యాయం అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. బుగ్గారం ఎస్సై శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో మండలంలోని గంగాపూర్, యశ్వంతరావు పేట సర్పంచ్ లు బోరగండ్ల జగన్, కోల రాజు లతో పాటు బుగ్గారం, చిన్నాపూర్, షేకల్ల, సిరికొండ సర్పంచ్ ల భర్తలు మూల శ్రీనివాస్ గౌడ్, ధమ్మ నర్సింగ్, వెల్కటూరి రమేష్, చెన్నమల్ల ప్రవీణ్ లను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.

1
232 views