
ఆళ్లగడ్డ ఎమ్మెల్యే పై మండిపడ్డ వైసిపి నేత భూమా కిషోర్ రెడ్డి
రాయలసీమ న్యూస్. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం లోని కేసీ కెనాల్ కింద పంట సాగు చేస్తున్న రైతులకు మరణమే శరణ్యం అన్నట్టుగా తమ జీవితాలు మారాయని ఆళ్లగడ్డ వైసిపి నేత భూమా కిషోర్ రెడ్డి బుధవారం రోజున మీడియా ముఖంగా తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గంలోని సిరివెళ్ల,గోవింద పల్లె రైతులు తమ పంటలకు కేసీ కెనాల్ నీళ్లు వదలాలని లేదంటే పంటలు ఎండిపోతాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న కూటమి ఎమ్మెల్యే అఖిల ప్రియకు అవేమీ పట్టకుండా ప్రతిపక్షంలో ఉన్న మమ్మల్ని తిరిగి గాడిదలు కాస్తున్నార అంటూ ఎదురు దాడి చేయడం సరికాదని ఆళ్లగడ్డలో చికెన్ సెంటర్ లపై ఒక కేజీకి పది రూపాయలు చొప్పున కమిషన్ కావాలని యజమానులపై బెదిరింపులు ఇవ్వకపోతే ఆ షాపులను ముగించడం ఇలాంటి చర్యలకు పాల్పడడం గత కాలంలో ఎప్పుడూ చూడలేదని. నియోజకవర్గ ప్రజల అభివృద్ధిని పట్టించుకోకుండా ఎప్పుడు శిల్పా వెంచర్ గురించి, షాపులపై కమిషన్లో గురించి దృష్టి పెట్టడం ఆళ్లగడ్డ ప్రజలను కలవరపెడుతుందని గత కాలంలో భూమా కుటుంబం,గంగుల కుటుంబం, మిగతా రాజకీయాల కుటుంబాలు చూసాం కానీ ఈ విధమైన అరాచక పాలన ఎన్నడూ చూడలేదని వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి మండిపడ్డాడు