పవిత్ర రంజాన్ మాసాంతం ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు
పవిత్ర రంజాన్ మాసాంతం ఉపవాస దీక్షలో ఉండే ముస్లిం సోదరుల ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు ఆత్మీయత,మత సామరస్యానికి ప్రతీక అని పాల్గొన్న వివిధ ఉపాద్యాయ సంఘాల నాయకులు పేర్కొన్నారు.కొత్తగూడెం పట్టణంలోని జమతే ఈ ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఉపాద్యాయ సంఘాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.జమతే ఈ ఇస్లామి హింద్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు జె బి ఎం కె ఎం జాఫర్ హజరయ్యారు. సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లిం సోదరులకు ఫలహారాలు తినిపించి ఉపవాస దీక్ష విరమింపజేశారు. అనంతరం అన్ని మతాలు చెప్పేది ఒక్కటేనని,మనషులంతా సోదర భావంతో కలిసి మెలిసి ఉండాలని ఉపాద్యాయ నాయకులు ఆకాంక్షించారు.