logo

Machilipatnam, Krishna District, Andhra Pradesh, India. నెలకురు కేసు కొట్టివేత.. కృష్ణాజిల్లా పొక్స కోర్టు తీర్పు...

నెలకురు కేసు కొట్టివేత.. కృష్ణాజిల్లా పొక్స కోర్టు తీర్పు...

బందరు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో 2019లో నమోదైన నెలకురు పోక్స కేసులో నిందితుడి పై నేరం రుజువు కాకపోవటంతో కేసును కొట్టివేస్తూ కృష్ణాజిల్లా పొక్స కోర్టు న్యాయమూర్తి గాజుల వెంకటేశ్వర్లు శుక్రవారం తీర్పు చెప్పారు.

బందరు మండలం నెలకురు గ్రామానికి చెందిన మైనర్ బాలికపై పోలాటితిప్ప గ్రామానికి చెందిన మోకా పరిశుద్ధ బాబు(25) అనే వ్యక్తి కిడ్నాప్ చేసి లైంగిక విధింపులకు పాల్పడ్డాడని తల్లి ఇచ్చిన ఫిర్యాదు పై బందరు తాలూకా పోలీస్ స్టేషన్లో ఐపిసి 363 సెక్షన్ కింద ఎఫ్ఐఆర్ 144 /2019గా కేసు నమోదు అయింది..

దరిమిలా అప్పటి తాలూకా ఎస్సై ఎన్.ఎల్.ఎన్ మూర్తి 11 మంది సాక్షలతో దాఖలు చేశారు. కేసు విచారణలో నిందితుడిపై తగిన సాక్షాదారాలు లేకపోవడంతో నేరం నిరూపణ చేయడంలో ప్రాసిక్యూషన్ విఫలం కావడంతో కేసు కొట్టివేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.

నిందితుడు తరపున లంకిశెట్టి బాలాజీ, మద్దాల సువర్ణ రాజు, కమ్మిలి విజయ్ కుమార్ న్యాయవాదులుగా వ్యవహరించారు.

6
313 views