పాల్వంచ మండలం గాజులగూడెంలో అరుదైన తాబేలు లభ్యం
పాల్వంచ మండలంలోని గాజులగూడెం గ్రామంలో నివాసముంటున్న అజ్మీర రాజేష్ తండ్రి రాంబాబు మూడు రోజుల క్రితం రాత్రి 9 గంటల సమయంలో వారింటికి తాబేలు రావడం జరిగింది. అట్టి విషయం లక్ష్మీదేవిపల్లి మండలంలోని రేగళ్ల పెద్దతండా గ్రామంలో నివాసం ఉంటున్న రాజేష్ మామగారు భూక్య కిషన్ గారికి సమాచారం అందించారు. కిషన్ గారు గాజులగూడెం వెళ్లి ఆ తాబేలు చూడగా ఆ తాబేలు సుమారు 15కేజీల బరువు ఉన్నది. దాని వయస్సు 15 సంవత్సరాల పైబడి ఉంటుందని. ఈ విషయం రేగళ్ళ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ బాణోత్ శంకర్ గారికి సమాచారం అందించారు. వారు వైల్డ్ లైఫ్ కిన్నెరసాని ప్రాజెక్ట్ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు గురువారం రోజున ఆ తాబేలు పూజ చేసి కిన్నెరసాని ప్రాజెక్ట్ డ్యాంలో వదిలేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ గణేష్ నాయక్, కిషన్ నాయక్, శ్రీను నాయక్, ఆంగ్ల ఉపాద్యాయులు బాలు నాయక్, విజయ్ కుమార్ ఫారెస్ట్ ఉద్యోగి, ఇబ్రాహీం, కుమార్ పాల్గొన్నారు.