ప్రేమ్ డ్యాన్స్ అకాడమి ఆధ్వర్యంలో,ధను క్రియేషన్స్ ఆధ్వర్యంలో పేదలకు మహా అన్నదానం
అనేక షార్ట్ ఫిల్మ్స్ మరియు బంజారాల పాటలకు నృత్య దర్శత్వం వహిస్తున్న ప్రేమ్ డ్యాన్స్ అకాడమి ఆధ్వర్యంలో మరియు అటు దేశ రక్షణలో సైనికుడు, ఇటు ప్రేక్షకులకు తనదైన శైలిలో సామాన్యులకు సైతం ఆనందింప చేస్తున్నా బి ప్రేమ్ కుమార్ ఆర్మీ టీమ్ కలిసి పాల్వంచ పట్టణంలో పలు ప్రాంతాల్లో అభాగ్యులకు, యాచాకులకు పేదలకు అన్నదానం చేశారు.ప్రేమ్ డ్యాన్స్ అకాడమి పిల్లల పుట్టినరోజు నాడు పేదలకు అన్నదానం చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు.ఈ సందర్భంగా రోడ్డు పై ఉన్న పేదలకు, అభగ్యులకు అన్నదానం చేశారు.ఇక నుంచి ప్రతీ శుభకార్యం రోజు అన్నదానం చేయాలి నిర్ణయించినట్లు సభ్యులు తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని సోషల్ మీడియా కో కన్వీనర్ యం బాలు నాయక్ అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రేమ్ డ్యాన్స్ అకాడమి,ధను క్రియేషన్స్ వై.టి ఛానల్ బాయ్స్ పాల్గొన్నారు.