logo

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఉచిత మెగా వైద్య శిబిరం.......

తేదీ 20 - 03 -2025: శేర్లింగంపల్లి చందానగర్:ఈరోజు చందానగర్ హుడా ఫేస్ II లో గల శిరిడి సాయిబాబా ఆలయ ఆవరణలో మెడికవర్ చందానగర్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఉదయం గం. 9.00 ల నుండి మధ్యాహ్నం గం. 2.00 వరకు ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో ఎత్తు, బరువు, కంటి, దంత, రక్తపోటు, షుగర్, పల్స్, ఈ.సీ.జీ., బీ. యం. డి. మొదలగు పరీక్షలు నిర్వహించారు. వైద్యులు డాక్టర్ ఆదిత్య (జనరల్ ఫిజిషియన్), డాక్టర్ శ్రీ తేజ (కౌ డెంటల్), విజన్ ఐ కేర్ డాక్టర్ నజీర్ తదితరులు వైద్యసేవలు అందించారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ " *మారిన జీవనశైలిలో పర్యావరణంలో వస్తున్న అనేక మార్పులవల్ల ప్రజలు అనేక వ్యాధులకు గురవుతున్నారు"* అని అన్నారు. " *ఆరోగ్యమే మహాభాగ్యం" కావున, కొన్ని జాగ్రత్తలు తీసుకున్న యెడల మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుందని తెలిపారు. ప్రతి ఒక్కరు నిత్యం వ్యాయామం, యోగ, ధ్యానము, నడక, కనీసం 40 నిమిషాలు చేయాలి. సాధ్యమైనంత వరకు తాజా ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్, పాలు, పాల ఉత్పత్తులు, చేపలు, గ్రుడ్లు, తృణధాన్యాలు, డ్రై ఫ్రూట్స్ వంటి పౌష్టికాహారం తీసుకొని, ఆరోగ్యం కాపాడుకోవాల* ని తెలిపారు. " *సాధ్యమైనంత మేరకు ఆల్కహాల్, పొగాకు, పొగాకు ఉత్పత్తులు, ఇతర మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల* "ని తెలిపారు. " *అనారోగ్యంగా ఉంటే, అశ్రద్ధ చేయకుండా, వెంటనే వైద్యులను సంప్రదించి, వారి సూచనలు, సలహాలు పాటించి, ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాల* " ని సూచించారు. " *మనం తీసుకొనే ఆహారం సమయ పాలన పాటించాల* "ని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో ఆలయ కమిటీ నాయకులు శ్రీనివాసరావు, రామిరెడ్డి, రాజయ్య, సిద్దిరాములు, శ్రీనివాస నాయక్, కిషోర్ బాబు మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాలం శ్రీనివాస్, శివరామిరెడ్డి, బాలరాజు, అలాగే హాస్పిటల్ ప్రతినిధి నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరంలో 102మందికి వైద్యసేవలు అందించారు.

159
4340 views