logo

సునీతా విలియమ్స్‌ను భూమిపైకి తీసుకొచ్చేందుకు ఎన్ని కోట్లు ఖర్చు అయ్యాయో తెలుసా?

సునీతా విలియమ్స్‌ను భూమిపైకి తీసుకొచ్చేందుకు ఎన్ని కోట్లు ఖర్చు అయ్యాయో తెలుసా?

సునీతా విలియమ్స్‌, విల్మోర్‌లను భూమిపైకి తీసుకొచ్చేందుకు డ్రాగన్‌ క్యాప్సుల్‌ అనే వ్యోమనౌకను నింగిలోకి పంపారు.

వారిద్దరిని భూమిపైకి తీసుకొచ్చేందుకు అమెరికా ఎంత ఖర్చు చేసిందో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం

క్రూ డ్రాగన్‌ క్యాప్సుల్‌ను నింగిలోకి పంపి, వ్యోమగాములను తిరిగి తీసుకొచ్చేందుకు ఏకంగా 140 మిలియన్‌ డాలర్లను ఖర్చు చేశారు.

మన కరెన్సీలో దాదాపు రూ,1,200 కోట్లపై మాటే.

భారీగా ఖర్చు చేయడానికి కారణం ఆ వ్యోమనౌకలో ఏర్పాటు చేసిన అనేక పరికరాలు. క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌ను కక్ష్యలోకి ప్రవేశపెట్టే స్పేస్‌ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్, 2024 నాటికి ఒక్కో ప్రయోగానికి దాదాపు $69.75 మిలియన్లు ఖర్చు చేసేది. అయితే, వ్యోమగాములను సురక్షితంగా తీసుకొచ్చేందుకు రూపొందించబడిన క్రూ డ్రాగన్ క్యాప్సూల్‌ను దాదాపు 140 మిలియన్ల డాలర్ల ఖర్చుతో రూపొందించారు. అదనపు బరువు, లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌లు, అంతరిక్ష ప్రయాణానికి అవసరమైన ఇతర కీలకమైన మానవ-రేటెడ్ భద్రతా భాగాలను ఇందులో ఏర్పాటు చేయడంతో ఇంత భారీగా ఖర్చు అయింది.

1
961 views