logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడు ఘనవిజయాలు

ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం
కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడు ఘనవిజయాలు

1. బీసీ రిజర్వేషన్ల బిల్లు
2. ఎస్సీ వర్గీకరణ బిల్లు
3. రాజీవ్ యువ వికాసం

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండల కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జుక్కల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులు అబ్దుల్ ఇమ్రోస్ బుధవారం నిజాంసాగర్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.

ఒకే రోజు మూడు ఘన విజయాలను ప్రజా ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టడం జరిగిందని,
రాజీవ్ యువ వికాస పథకం కింద నిరుద్యోగులకు బీసీ ఎస్సీ ఎస్టీ మరియు మైనార్టీ యువతకు స్వయం ఉపాధి కల్పించాలని ఉద్దేశంతో
ఈ ప్రజా ప్రభుత్వం..
మూడు బిల్లులను ప్రవేశపెట్టడం గర్వించదగ్గ విషయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతుందని కొనియాడారు. కార్యక్రమంలో నిజాంసాగర్ మండల యువజన కాంగ్రెస్ నాయకులు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

136
7755 views

Comment