logo

చిన్నారికి వచ్చిన పెద్ద కష్టం,పది పరీక్షలు రాయాల్సిన చేతులతో మిర్చి కోతలు

ఆ విద్యార్థిని పేరు... సన్నక్కి చిన్నారి! పదో తరగతి పరీక్షలు రాయాల్సింది! కానీ... గుంటూరు జిల్లా పేరేచెర్ల పొలాల్లో మిర్చి కోస్తోంది.! వలస కష్టం ఈ చిన్నారి చదువును చిదిమేసింది. కర్నూలు జిల్లా కోసిగి మండలం చింతకుంట గ్రామానికి చెందిన సన్నక్కి చిన్న మారెప్ప, కమలమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వీరు ఈ ఏడాది జనవరిలో సొంత ఊరు వదిలి పేరేచర్లలో మిరప కోత పనులకోసం వలస వెళ్లారు. పదో తరగతి చదువుతున్న చిన్నారిని సైతం తమతో తీసుకెళ్లారు. పది పరీక్షలు ఎంత కీలకమో చిన్నారికి తెలిసినప్పటికీ... తల్లిదండ్రులకు తోడుగా వెళ్లక తప్పలేదు. ఇది ఒక్క చిన్నారి కథ మాత్రమే కాదు. ఎంతోమంది విద్యార్థుల వ్యథ! కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతం నుంచి ఏటా భారీగా జనం వలసలు వెళ్తుంటారు. తమతోపాటు పిల్లలనూ తీసుకెళ్తుండటంతో... వారి చదువులు దెబ్బతింటున్నాయి.

1
76 views