logo

కళ్ళములోని మిరప కాయలు కాలబెట్టిన దొంగలు అరెస్టు :ఇరువురు నిందితులకు రిమాండుకు పంపించిన ఏడుళ్ళ బయ్యారం ఎస్సై రాజకుమార్,

తెలంగాణ స్టేట్ **భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** పినపాక మండలం**
**18/03/25(మంగళవారం)

కళ్ళములోని మిరప కాయలు కాలబెట్టిన దొంగలు అరెస్టు

:ఇరువురు నిందితులకు రిమాండుకు పంపించిన
ఏడుళ్ళ బయ్యారం ఎస్సై రాజకుమార్,

*పురుషోత్తం చేతబడి చేస్తున్నాడన్న అనుమానం తోనే ఆర్థికంగా దెబ్బతీయ టానికి మిర్చిని తగలబెట్టిన ఇరువురు నిందితులు,

*కేసును త్వరగా చేదించిన ఏడుల్లబయ్యారం సీఐ వెంకటేశ్వర్లు ,ఎస్సై రాజ్ కుమార్ ను డి.ఎస్.పి రవీందర్ రెడ్డి ఈ సందర్భంగా వారిని అభినందించారు.,

పినపాక, మార్చి17:( మీడియా ప్రతినిధి) మండల పరిధిలోని
వెంకట్రావుపేట గ్రామానికి చెందిన పొనగంటి పురుషోత్తం అనే వ్యక్తి అమ్మకానికి సిద్ధంగా ఉన్న మిరపకాయలు కళ్ళoల్లోకి వెళ్లి ఎండబెట్టిన 50 క్వింటాళ్ల
ఎండు మిర్చిని గుర్తు తెలియని వ్యక్తులు పెట్రోలు పోసి తలగబెట్టిన విషయం పాఠకులకు విధితమే సంఘటన అనంతరం బాధితుడు ఏడుల్ల బయ్యారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎస్సై రాజ్ కుమార్ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు ఆనంతరం మణుగూరు డిఎస్పి రవీందర్ రెడ్డి ఆదేశాల ప్రకారం సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్సై రాజకుమార్ కేసు దర్యాప్తును ముమ్మరం సాక్షాధారాల ఆధారంగా నిందితులుగా అదే గ్రామానికి చెందిన తాండ్ర బాలకృష్ణ సన్నాఫ్ వెంకటేశ్వర్లు, (33 y) అతనికి మామ వరుస అయినా మంచర్ల వెంకటేశ్వర్లు s/o పుల్లయ్య, (49 y), బెస్త,, నిందితులు వెంకటేశ్వరపురం గ్రామం వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుంటే మోటార్ సైకిల్ పై పారిపోతుంటే పట్టుకొని విచారించగా తాండ్ర బాలకృష్ణ అనే వ్యక్తి భార్య గత సంవత్సరం క్రింద చనిపోగా దానికి కారణం పురుషోత్తంమే మంత్రాలు చేయడం వల్లనే తన భార్య చనిపోయిందని అతడు మనసులో కక్ష పెంచుకొని ఈ విషయాన్ని తన మామ వెంకటేశ్వర్లుకు చెప్పగా అతడు కూడా తనను పెద్దమనిషిగా ఎదగనీయకుండా పురుషోత్తమే అన్ని పంచాయతీలలో అడ్డుపడుతున్నాడని అతనిని ఎలాగైనా ఆర్థికంగా దెబ్బ తీయాలని ఇరువురు నిందితులు పథకం ప్రకారo సరైన సమయం కోసం వేచి చూస్తూ మార్చి 10వ తారీకు అర్ధరాత్రి సమయం లో మిరపకాయల కల్లాల వద్ద ఎవరు కాపలా లేరని నిర్ధారించుకుని పురుషోత్తంనికి సంబంధించిన పొలం కళ్ళంలోని 50 క్వింటాళ్ల వెండి మిర్చినీ బాలకృష్ణ తను వెంట తెచ్చిన ఐదు లీటర్ల పెట్రోలు ఎండు మిర్చి చుట్టూ చెల్లి నిప్పు పెట్టాడు .వెంకటేశ్వర్లు రోడ్డుపై కాపలాగా ఉన్నాడు.మిర్చికి మంటలు అంటుకున్న వెంటనే ఇద్దరు నిందితులు అక్కడి నుండి పరారై వారి ఇళ్లకు చేరుకొని ఆ రాత్రి ఇళ్లలోనే నిద్రించినారు అని పోలీసులు పత్రికాముఖంగా తెలిపారు సోమవారం ఇరువురు
నిందితులనీ రిమాండ్కి తరలించారు .కేసును త్వరగా చేదించిన ఏడుల్లబయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై రాజుకుమార్ ఇరువురిని డి.ఎస్.పి రవీందర్ రెడ్డి అభినందించారు.ఈ కార్యక్రమంలో
సిబ్బంది లక్ష్మీనారాయణ
దిలీప్, శ్రీనివాస్, రాము ,లక్ష్మయ్య పాల్గొన్నారు.

335
13962 views