logo

అభివృద్ధి సంస్థల కోసం ప్రభుత్వ స్థలాలను అన్వేషించండి.... జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

17 -03 2025
నంద్యాల

జిల్లాలోని అభివృద్ధి సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వ స్థలాలను గుర్తించాలని జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పిజిఆర్ఎస్ హాలులో జిల్లా నలుమూలాల నుంచి వచ్చిన ప్రజల నుండి ఫిర్యాదుల స్వీకరణకు ముందు వివిధ అంశాలపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్, డిఆర్ రామునాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు జిల్లా అధికారులు పాల్గొన్నారు.*

*ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ పార్కులు, కుసుమ్ కార్యక్రమం క్రింద విద్యుత్ సబ్ స్టేషన్లు, రిలయన్స్ సంస్థ వారిచే కంప్రెస్డ్ బయో గ్లాస్ ప్లాంట్లు, స్టార్ హోటళ్లు, ఐటిఐ సంస్థల ఏర్పాటుకు డివిజన్ల పరిధిలో ప్రభుత్వ స్థలాలను అన్వేషించాలని సూచించారు. విద్యుత్ సబ్ స్టేషన్ లకు 5 నుండి 10 ఎకరాలు, ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు 50 నుండి 100 ఎకరాలను స్థలాలను గుర్తించాలన్నారు. నంద్యాల జిల్లాలో రెండు స్టార్ హోటల్స్ రానున్నాయని...రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్ అండ్ బీ శాఖలకు చెందిన భూములను గుర్తించాలన్నారు. స్టార్ హోటల్ నిర్మాణానికి 2 నుండి 3 ఎకరాల భూమిని గుర్తించాలన్నారు. జాతీయ రహదారి శివారు ప్రాంతాలు, లేక్ వ్యూ, హిల్ వ్యూలతో కూడిన భూములను పరిశీలించాలని జాయింట్ కలెక్టర్ ను సూచించారు. నంద్యాల పట్టణంలో స్టార్ హోటల్ ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని నంద్యాల ఆర్డీఓను కలెక్టర్ ఆదేశించారు. రిలయన్స్ సంస్థ ఏర్పాటుచేసే కంప్రెస్డ్ బయో గ్యాస్ ఏర్పాటుకు స్థలాలను పరిశీలించాలన్నారు. ఇందుకోసం రిలయన్స్ కంపెనీ బృందాలు జిల్లాకు వచ్చి స్థల పరిశీలన అంశంపై నంద్యాల ఆర్డీఓను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ఐటిఐ కళాశాల ఏర్పాటు కోసం రెండు ఎకరాల భూమిని కేటాయించేలా స్థలాలను అన్వేషించాలన్నారు.

3
373 views