చల్మెడ గ్రామంలో ఘనంగా మత్తడి పోచమ్మ కళ్యాణం మహోత్సవం..
మెదక్ మీడియా టుడే స్టాఫ్ రిపోర్టర్ - బైండ్ల లక్ష్మణ్-
మెదక్ జిల్లా నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో ఆదివారం రోజున గ్రామంలో గల ముదిరాజ్ సంఘం వర్గీయులు, సంగెపు జంగి వారి. ఆధ్వర్యంలో అమ్మవారి బోనాల కార్యక్రమం ఘనంగా నిర్వహించి తదానంతరం అందరి సమక్షంలో ఘనంగా అమ్మవారి కళ్యాణ మహోత్సవం జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముదిరాజ్ సంగెపు, జంగి వారు అమ్మవారును ఘనంగా పూజించి అమ్మవారి కృప కటాక్షాలు మాపై ఉండాలని అందరి కుటుంబ సభ్యులతో పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని కోరుకున్నారు
ఈ కార్యక్రమంలో వర్గ సభ్యులు అధ్యక్షులు ఎస్ స్వామి, జె యాదగిరి, మాజీ సర్పంచ్ సంగెపు నారాయణ, ఎస్ చంద్రమౌళి, ఎస్ జీవన్, జే వెంకట్, ఎస్ శ్రీను, జె అశోక్, వర్గ ప్రజలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.