logo

రాజీవ్ యువ వికాసం *పథకంషెడ్యూల్డ్ తెగలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాల ద్వారా ఆర్థిక పురోగతి * :భద్రాద్రి ఐటీడీఏ పీవో బి రాహుల్,

తెలంగాణ స్టేట్*** భద్రాద్రి కొత్తగూడెం జిల్లా***
*భద్రాచలం* 16 మార్చి 25*


తెలంగాణ రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగలకు చెందిన నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాల ద్వారా ఆర్థిక పురోగతి పెంపొందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన *రాజీవ్ యువ వికాసం పథకం* ప్రకటించిందని, ఈ పథకం కింద గిరిజన నిరుద్యోగులకు స్వయం ఉపాధి పథకాలు అందించడానికి ప్రణాళికలను ఆమోదించడం జరిగిందని భద్రాచలం ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదివారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.
కావున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మరియు ఖమ్మం జిల్లాలో ఉన్న అర్హత మరియు ఆసక్తిగల గిరిజన నిరుద్యోగులు OBMMS ఆన్లైన్ పోర్టల్ https://tgobmmsnew.cgg.gov.in ద్వారా దరఖాస్తులు నమోదు చేసుకోవచ్చని, అర్హత ప్రమాణాలు పథకాలు మరియు ఇతర వివరములు https://tgobmms.cgg.gov.in వెబ్ సైట్ నందు పొందుపరచబడినవని, ఈ నమోదు ప్రక్రియ ఈనెల 17 నుండి వచ్చేనెల 5వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు.
మరిన్ని వివరాల కొరకు జిల్లాలోని ప్రాజెక్టు అధికారి, సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ భద్రాచలం చరవాణి నెంబర్ 94928 06325 మరియు 98485 22 841 నంబర్లకు ఫోన్ ద్వారా తెలుసుకోవాలని లేదా మీ పరిధిలోని ఎంపీడీవో కార్యాలయంలలో సంప్రదించగలరని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాలోని ఎంపీడీవోలు రాజీవ్ యువ వికాసం పథకం గురించి గిరిజన నిరుద్యోగ యువకులకు తెలిసేలా మీ మండల పరిధిలో ముమ్మరంగా ప్రచారం జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆయన కోరారు.

129
2998 views