logo

ఆంధ్రప్రదేశ్ కలం కౌంటర్ కృష్ణా జిల్లా లీగల్ వేలేఖరి గా కమ్మిలి విజయ్

*కలం కౌంటర్ దినపత్రిక అభివృద్ధి కి కృషి చేయండి*

*మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ప్రముఖ సీనియర్ న్యాయవాది లంకిశెట్టి బాలాజీ గారు*


అన్ని వర్గాల ఆకాంక్షలు గౌరవిస్తూ నిబద్దత తో నడుపుతున్న కలం కౌంటర్ దినపత్రిక అభివృద్ధికి కృషి చేయాలని మచిలీపట్నం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు లంకిశెట్టి బాలాజీ సూచించారు. శుక్రవారం లంకిశెట్టి కార్యాలయం లో కలం కౌంటర్ దినపత్రిక చీఫ్ ఎడిటర్ రవికుమార్ సమక్షంలో కమ్మిలి విజయకుమార్ కు పత్రిక జిల్లా గౌరవ సలహాదారుడి ఐడెంటిటీ కార్డు లంకిశెట్టి బాలాజీ అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు వున్నా క్రమశిక్షణ తో పత్రిక నడపడం ప్రశంసనీయం అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పత్రిక కు గుర్తింపు వచ్చిందంటే దీని వెనుక నష్టం,కష్టం,నిజాయితీ ఉందన్నారు. ఈ కార్యక్రమం లో కృష్ణా జిల్లా మాజీ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అడపా మురళీ, ఘంటసాల నక్షత్రం సైద్ గోపీ, కుతాని ఆంజనేయులు పాల్గొన్నారు.

3
121 views