logo

మండల కార్యాలయాల నిర్మాణ పనులను పరిశీలించిన జడ్పీ సీఈవో

మండల కార్యాలయాల నిర్మాణ పనులను పరిశీలించిన జడ్పీ సీఈవో

బుగ్గారం మండల కేంద్రంలో నిర్మాణం అవుతున్న మండల పరిషత్, మండల రెవెన్యూ కార్యాలయాల భవనాల నిర్మాణ పనులను జడ్పీ సీఈవో కె.గౌతం రెడ్డి శనివారం పర్యవేక్షించారు.
కొత్త భవన నిర్మాణం తొందరగా పూర్తి చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం బుగ్గారంను ఆయన సందర్శించారు. ఇంటి పన్నుల వసూలు 100 శాతం పూర్తి కావాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీ రికార్డులను తనిఖీ చేశారు. గ్రామంలో నీటి సమస్య రాకుండా చూడాలన్నారు. పారిశుధ్య పనులు సక్రమంగా జరగాలని అదేశించారు.
ఎంపిడిఓ అఫ్జల్ మియా, ఎఈఈ మహేందర్, పంచాయితీ కార్యదర్శి యం.ఎ. అక్బర్ లు ఉన్నారు.

1
231 views