logo

*ప్రెస్ రిలీజ్...13-03-2025.* *కూతలేరు వంకపై బ్రిడ్జి నిర్మించండి...* *- ముఖ్యమంత్రికి మడకశిర, శింగనమల ఎమ్మెల్యేలు

*ప్రెస్ రిలీజ్...13-03-2025.*

*కూతలేరు వంకపై బ్రిడ్జి నిర్మించండి...*

*- ముఖ్యమంత్రికి మడకశిర, శింగనమల ఎమ్మెల్యేలు వినతి*

*- *ప్రెస్ రిలీజ్...13-03-2025.*

*కూతలేరు వంకపై బ్రిడ్జి నిర్మించండి...*

*- ముఖ్యమంత్రికి మడకశిర, శింగనమల ఎమ్మెల్యేలు వినతి*

*- మంత్రి నిమ్మలకు ఉమ్మడి వినతి అందించిన ఎమ్మెల్యేలు*

*సచివాలయం/వెలగపూడి :*

శింగనమల నియోజకవర్గం అలంకరాయునిపేట గ్రామంలో, కూతలేరు వంకపై బ్రిడ్జి నిర్మించాలని ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారికి మడకశిర శాసనసభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు శ్రీ ఎం.ఎస్.రాజు గారు మరియు శింగనమల శాసనసభ్యురాలు బండారు శ్రావణిశ్రీ గారు సచివాలయంలోని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం అందించారు. అలంకరాయుని పేట గ్రామస్తులు వర్షాకాలంలో కూతలేరు వంక పొంగిన సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. ముఖ్యంగా విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే వంక పొంగిన సమయంలో తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని తెలిపారు. దీనిపై ముఖ్యమంత్రివర్యులు సానుకూలంగా స్పందించి, తక్షణమే ఈ వంకపై బ్రిడ్జి నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ముఖ్యమంత్రివర్యులను కలిసిన అనంతరం...రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారికి మడకశిర శాసనసభ్యులు, శింగనమల శాసనసభ్యురాలు బండారు శ్రావణిశ్రీ గారు సచివాలయంలోని తన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కూతలేరు వంకపై బ్రిడ్జి నిర్మించాలని కోరుతూ ఉమ్మడిగా వినతిపత్రం అందించారు. వర్షాకాలంలో వంక పొంగినప్పుడు విద్యార్థులు పాఠశాలలకు వెళ్లేందుకు అదేవిధంగా రైతులు, రైతు కూలీలు పనులకు వెళ్లేందుకు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారని మంత్రికి వివరించారు. ఏళ్ల తరబడి అలంకరాయునిపేట గ్రామస్తులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యకు పరిష్కారం చూపించాలని మంత్రిని కోరారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించి, అలంకరాయునిపేట గ్రామంలో కూతలేరు వంకపై బ్రిడ్జి నిర్మాణానికి సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

*(మడకశిర శాసనసభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు వారి కార్యాలయం నుండి జారీ.....)*ఎమ్మెల్యేలు*

*(మడకశిర శాసనసభ్యులు, టీటీడీ పాలకమండలి సభ్యులు వారి కార్యాలయం నుండి జారీ.....)*

0
112 views