నల్లరాయి క్వారీ విధ్వంసం ఆందోళనలో ప్రజలు
మండలంలోని రాజన్నపేట గ్రామం వద్ద గల బొడ్డమెట్ట నల్లరాయి క్వారీ వలన చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రైతులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు బొడ్డమెట్టను ఆనుకుని ఉన్న మల్లమ్మ చెరువు క్రింద గల సుమారు 80 ఎకరాల పంట పొలాలు సాగు చేసే రైతులు ఆందోళన చెందుతున్నారు ఈ క్వారీ లారీలు వల్ల గతంలో బుచ్చంపేటలో రహదారుల పాడవటం అలాగే బుచ్చంపేట శివారులో ఉన్న గోపురం ధ్వంసం జరిగింది క్వారీ బ్లాస్టింగ్ సమయంలో యాజమాన్యం రైతుల యొక్క పశువులను దూరంగా తీసుకెళ్లి బ్లాస్టింగ్ అయిన తరువాత తిరిగి పాకల వద్దకు పశువులను తీసుకొస్తున్నారని రైతులు తెలిపారు తిరగబడిన రైతులను బెదిరించి భయపెడుతున్నారు గతంలో జరుమూరు సత్తిబాబు అనే వ్యక్తి ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్టు తెలుస్తుంది ఎన్ని జరిగినా ప్రభుత్వం గానీ అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు గాని ఎటువంటి చర్యలు తీసుకోకుండా నెమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ చోద్యం చూస్తున్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు ఇకపైనైనా మేలుకొని అధికారులు ఈ క్వారీని నిలుపుదల చేసి ప్రజల సమస్యలకు పరిష్కార మార్గం చూపుతారని ప్రజలు రైతులు కోరారు