క్వారీ లారీల వలన ఆందోళన చెందుతున్న ప్రజలు
మండలంలోని రాజన్నపేట వద్ద గల బొడ్డుమెట్ట నల్లరాయి క్వారీ ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు లీజికి ఇవ్వడం వలన ఈ క్వారీ యాజమాన్యం రైతులను చుట్టుపక్కల గ్రామాల ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారు క్వారి వలన బొడ్డుమెట్ట ఆనుకుని ఉన్న మల్లమ్మ చెరువు క్రింద గల 80 ఎకరాల సాగుభూమి ప్రశ్నార్థకంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు బుచ్చంపేట గ్రామ శివారులో ఉన్న ముఖ ద్వారం కూడా క్వారీ లారీలే ధ్వంసం చేసి శిథిలాలను యథావిధిగా ఉంచి వెళ్లిన సంఘటన ఈ మధ్యనేజరిగింది అలాగే క్వారీ బ్లాస్టింగ్ చేసే సమయంలో చుట్టుపక్కల రైతుల పశువులను దూరంగా తీసుకువెళ్లి బ్లాస్టింగ్ అయిన తర్వాత యధావిధిగా వారి యొక్క పాకలలో క్వారీ యాజమాన్యమే తీసుకొచ్చి కొడుతున్నారు ఎదురు తిరిగిన రైతులను బెదిరించి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఎదిరించిన జలుమూరి సత్తిబాబు అనే రైతును బెదిరించడం వలన గతంలో ఈయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు ఇన్ని జరుగుతున్నా అధికారులు కానీ ప్రజా ప్రతినిధులు గాని పట్టించుకోలేదు . క్వారీ నిలుపుదల చేసి ఇకనైనా తమకు న్యాయం చేయాలని రైతులు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కోరుతున్నారు