రిజిస్ట్రేషన్, ధరణి ప్రక్రియ సక్రమంగా జరిగేలా చర్యలు చేపట్టాలి. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.మెదక్ మీడియా టుడే స్టాఫ్ రిపోర్టర్..బైండ్ల లక్ష్మణ్..
కౌడిపల్లి మండలం తహసీల్దార్ కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం సందర్శించారు. కార్యాలయాన్ని మొత్తం కలియ తిరుగుతూ సిబ్బందితో మాట్లాడారు. భద్రపరిచిన రికార్డులు, వీడియో కాన్ఫరెన్స్, రిజిస్ట్రేషన్ గదులను పరిశీలించారు. రికార్డులను జాగ్రత్తగా భద్రపరచాలని , ధరణి పనితీరును పరిశీలించారు. సర్వర్ ఎలా పనిచేస్తుందని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ధరణి పెండెన్సీ త్వరితగతిన పూర్తి చేయాలని కార్యాలయం ఆవరణలో మంచి వాతావరణం కనిపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. భూ రిజిస్ట్రేషన్లు, ఇతర అవసరాల కోసం వచ్చే ప్రజలు కూర్చునేందుకు కుర్చీలు ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పారు.
వీడియో కాన్ఫరెన్స్ గదిలో సీసీ కెమెరా పనితీరును ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. సాంకేతిక సమస్యలు ఎదురైనప్పుడు వెంటనే జిల్లా కార్యాలయ సిబ్బందితో మాట్లాడి సరి చేసుకోవాలని చెప్పారు.