logo

18 నుంచి 20 వరకు ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలపై చర్చ.*


*స్పీకర్ అయ్యన్నపాత్రుడు గారితో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సమావేశం.

సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, మంత్రులు ఎమ్మెల్యేలు

18 నుంచి 20 వరకు ఎమ్మెల్యేలకు క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలపై చర్చ.

అమరావతి: బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసనసభ్యులకు మార్చి 18, 19, 20 తేదీల్లో క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తు, పాత సంప్రదాయాన్ని పునరుద్ధరించడం పట్ల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హర్షం వ్యక్తం చేసారు. క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ ఏర్పాట్లు పట్ల క్రీడా
శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, మంత్రులు ఎమ్మెల్యేలతో స్పీకర్ అయ్యన పాత్రుడు గారు అసెంబ్లీ లో సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేసారు. రాజకీయ నాయకులకూ రిలీఫ్ ఉండే విధంగా పురుష ఎమ్మెల్యేలకు క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్ వంటి వాటిలో పోటీలు, మహిళా ఎమ్మెల్యేలకు బ్యాడ్మింటన్, త్రో బాల్, టెన్నీ కాయిట్, టగ్ ఆఫ్ వార్, వంద మీటర్ల పరుగు పందెం వంటివి. పాటలు, నాటకాలు, స్కిట్లు, నృత్యం, సోలో అభినయం తదితర సాంస్కృతిక కార్యక్రమాలపై సమావేశంలో చర్చించారు. అందరూ ఉత్సాహంగా పాల్గొనాలని అని కోరారు. 20న రాత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో బహుమతి ప్రదానోత్సవం ఉంటుందని పేర్కొన్నారు. అందరు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా ఆహ్వానించనున్నారు.

0
187 views