
అయోథి (తమిళ్ చిత్రం)
సినిమా ఆద్యంతం మానవత్వమే. హృదయాల్ని స్పృశించే కథ కథనం.
అయోధ్యలో మొదలైన కథ తమిళనాడు మదురై మీదుగా రామేశ్వరం హైవే మీద ఓ ఆక్సిడెంట్ తో పెద్ద మలుపు తిరుగుతుంది.
ఉత్తర హిందుస్థాన అయోధ్యకి చెందిన ఓ అహంకార బ్రాహ్మణుడి మూర్ఖత్వం కారణంగా వారి అందమైన చిన్ని కుటుంబం పెద్ద చిక్కుల్లో పడుతుంది.
ఊరు కాని ఊరిలో, భాష తెలియని మనుషుల మధ్య, అనుకోని రీతిలో రోడ్డు ప్రమాదానికి గురయ్యి తల్లిని కోల్పోయిన అమ్మాయి శివాని పాత్రలో ప్రీతీ అస్రాని నటన అద్భుతం.
ఓ చిన్ని తమ్ముడు, మూర్ఖుడైన తండ్రి. భాష తెలియని ప్రాంతం.
మానవత్వం తో స్పందించిన స్థానిక యువకుడు. అతని ప్రయత్నాలకి సహకరించిన అనేకమంది మనుషులు.
కాకపోతే ఆ సదరు హిందూ మూర్ఖుడు అనేక సందర్భాలలో పోస్టు మర్టంని వ్యతిరేకిస్తాడు. అవయవ దానాన్ని వ్యతిరేకిస్తాదు. హిందూ పురాణాలు ఒప్పుకోవు అంటూ కేకలేస్తాదు.
అబార్షన్లని, కుటుంబ నియంత్రణ ఆపరేషన్లని, అవయవ దానాల్ని వ్యతిరేకించేది ఏ మతస్థులో మన అందరికీ చక్కగా తెలుసు.
హిందువులు మూర్ఖులు , మత పిచ్చగాళ్ళు అని బాహటంగా చిత్రీకరించటానికి దర్శకురాలు వెనుకాడలేదు.
తమిళ హిందీ మనుషుల మధ్యలో ఉందే విభేదాలని అపార్థాలని చక్కగా చిత్రీకరించారు. ఇవి కొన్ని పంటి కింద రాళ్ళ లాంటి అంశాలు.
ఇవి మినహాయిస్తే చిత్రం అంతటా మానవత్వమే.
అనేక సందర్భాలలో కంటతడి పెట్టించింది.
అబ్దుల్ మాలిక్ అయితేనేమి, సీతారాం అయితేనేమీ మనుషుల మధ్య ప్రేమ ముఖ్యం అని ఒక సందేశం ఇస్తారు. సోదర ప్రేమగా చూపటం ఉన్నంతలో రిలీఫ్.
చివర్లో ఆ యువకుడు ఇస్లాం మతానికి చెందిన వాడిగా చూపటం అంత అవసరమా అనిపించింది. చూపిరిపో, అతను శ్రద్ధగా ప్రార్థన చేసుకుంటున్న దృశ్యంతో ముగించటం కాస్త అతిగా అనిపించింది.
పంటి కింద రాయి లాంటి కొన్ని ఇలాంటి మినహాయిస్తే యావత్తు చిత్రం ఒక సజీవ దృశ్య కావ్యం .