logo

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు MVR గ్రూపు అంతర్జాతీయ మహిళా దినోత్సవం....

తేది: 08-03-2025: చందానగర్: మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి మండలంలోని జంట సర్కిళ్ళ పరిధిలో ఉన్న 40 కాలనీలలో క్రీడా పోటీలు నిర్వహించి విజేతలైన స్త్రీ మూర్తులకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఈ రోజు మధ్యాహ్నం తారానగర్ లో ఉన్న విద్యానికేతన్ మోడల్ హైస్కూల్ లో ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు MVR గ్రూప్స్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథులుగా హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలోని ఆచార్య దేవారెడ్డి విజయలక్ష్మిగారు, MVR groups చైర్మన్ మూల వేంకటేష్ గౌడ్ గార్లువిచ్చేశారు. మొదటగా వేంకటేష్ గౌడ్ గారు సభను ఉద్దేశించి మాట్లాడుతూ " *మహిళలు తమ బాధ్యతలతో కుటుంబ గౌరవాన్ని కాపాడుకుంటూ, బయట సమాజంలో తమ విధులను సమాజ శ్రేయస్సుకై నిర్వహిస్తూ జాతి సంస్కృతులను నిలబెడుతున్నారు"* అంటూ మహిళా సమూహాన్ని కొనియాడారు. ఆచార్య దేవారెడ్డి విజయలక్ష్మి ప్రసంగిస్తూ *దేశఆర్థికస్థితిని సురక్షితంగా కాపాడుతున్న స్త్రీసమాజాన్ని ప్రభుత్వం గుర్తించి అన్ని రంగాల్లో స్త్రీలను ప్రోత్సహిస్తుందని, స్త్రీలుకూడా ప్రభుత్వ, ప్రయివేటు రంగాలలో చొచ్చుకుపోతూ తమదైన తెలివితేటలతో బాధ్యతలను నెరవేరుస్తూ ఆర్థికరంగంలోనూ, సామాజిక, సాంస్కృతిక రంగాలలోనూ అభివృద్ధికి పాటుపడుతున్నారని మహిళాశక్తిని ప్రశంసించారు. ఈ సంవత్సరం యునెస్కోవారు పంపిన సందేశం ప్రకారం ఇప్పటి వరకు స్త్రీలకు కొన్ని నిబంధనలతో కూడిన హక్కులు ఉండేవి. కానీ నేటి మహిళా దినోత్సవం నుండి తారతమ్యాలులేని సమానత్వ హక్కులు స్త్రీలు అందుకోవాలని పిలుపునిచ్చింది. మన‌ పనులను మనమే చేసుకుంటూ పోవడం అలవరుచుకుంటే తప్పక మన హక్కులు మనం కాపాడుకోగలమన్న భావన‌ పెంపొందించుకుని మెలగాలని
తెలియజేశారు. ఈ సందర్భంగా జంట సర్కిళ్ళ పరిధిలోని మహిళా నాయకురాళ్ళకు 85 మందికి ఉత్తమ మహిళా పురస్కారాలతో సాంప్రదాయ బద్దంగా, ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి విజయజ్యోతి, శ్రీమతి మేకల విజయలక్ష్మి మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు శ్రీమతి వాణి సాంబశివరావు, అమ్మయ్య చౌదరి, జనార్ధన్, విజయలక్ష్మి, సుశీల, G.V. రావు, శివరామకృష్ణ, బాలన్న తదితరులు పాల్గొన్నారు.

79
1970 views