logo

"అత్యద్భుతం" అనిపించిన "స్వర బృందావనం" 13 వ సంగీత విభావరి.

శ్రీ పసుమర్తి రాంబాబు శ్రీమతి సీత దంపతుల 46 వ "వివాహ వార్షికోత్సవ ప్రత్యేక కార్యక్రమం" గా "స్వర బృందావనం" 13 వ సంగీత విభావరి 01.03.2025 తేదీన "కళా భారతి సిటీ కల్చరల్ సెంటర్ హైదరాబాద్" లో ప్రేక్షకులను అలరిస్తూ 2 భాగాలుగా ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు అవిశ్రాంతంగా సాగింది.
శ్రీ రాంబాబు సీత దంపతులు ఈ కార్యక్రమానికి స్పాన్సర్లు గా వ్యవహరించారు. కార్యక్రమ నిర్వాహకులు, గాయకులు అయిన శ్రీ రవికాంత్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. అద్భుతమైన కంఠాలతో, అలరించే పాటలతో గాయనీ గాయకులు అమోఘంగా రాణించారు.
మొట్టమొదట వినాయక ప్రార్ధన శ్రీ రాంబాబు చే గావింపబడినది. పిమ్మట హనుమంతరావు "జయ జయ జయ జయ వినాయకా" అంటూ వినాయకుని సభాస్థలికి ఆహ్వానించారు. తరువాత వెంకటరమణ మూర్తి సాయిబాబా ను, శరత్ కృష్ణ "శివ శివ శంకర" అంటూ మహాశివుని ఆహ్వానించారు.
తరువాత మొదలైన కార్యక్రమం లో శ్రీ కుమార్ సీత "కళ్యాణ వైభోగమే" అంటూ కళ్యాణ వైభోగాన్ని చాటితే, నాగేశ్వరరావు "హలో గురూ ప్రేమ కోసమే" అంటూ ప్రేమ ఆధిపత్యాన్ని తెలిపారు. హనుమంతరావు శ్రీలక్ష్మి " హాయి హాయిగా ఆమని సాగే" అంటూ ఆమనిని తీసుకుని వస్తే, రవికాంత్ శ్రీలక్ష్మి "ప్రియతమా నను పలకరించు ప్రణయమా" అంటూ ప్రియతముల ను పిలిచారు. వెంకట రమణమూర్తి దమయంతి "వయసే ఒక పూలతోట" అంటే, రవికాంత్ శ్రీ రాణి "కళ్లలోన నీవే గుండె
లోన నీవే" అంటూ చెలిమిని చాటారు. రాంబాబు దమయంతి "నా మది నిన్ను పిలిచింది గానమై" అంటూ అలరిస్తే, శరత్ కృష్ణ శ్రీలక్ష్మి "ఒకనాటి మాట కాదు" అంటూ యుగయుగాల చరిత్ర ను తవ్వి తీశారు. వెంకట రమణమూర్తి రమాదేవి "కనులలో నీ రూపం" అంటే నాగేశ్వరరావు "జీవితమే ఒక ఆట" అన్నారు. శరత్ కృష్ణ దమయంతి "సన్నాజాజికి గున్నామావికి" అంటే రవికాంత్ దమయంతి "ప్రియా ప్రియతమా రాగాలు" అంటూ రాగం తీశారు. రమాదేవి శ్రీ కుమార్ "తనివి తీరలేదే" అంటే హనుమంతరావు సీత "మురిపించే అందాలే" అంటూ మురిపించే అందాలను వర్ణించారు.
ప్రేక్షకుల కోరిక పై సీత రాంబాబు దంపతులు "శ్రీమతి గారికి తీరని వేళ" అంటూ దాంపత్యపు సరాగాలతో అలరించారు. పిమ్మట హనుమంతరావు రీటా "వీణ వేణువైన సరిగమ విన్నావా" అంటూ సరిగమ లొలికిస్తే, శరత్ కృష్ణ సీత "నీ మది లో నేనే ఉంటే" అంటూ ప్రేమికుల మనసు విప్పారు. వెంకట రమణమూర్తి రీటా "గోదారి గట్టు మీద రామ చిలుక వో" అంటూ కొత్త సినిమా పాట అద్భుతంగా ఆలపిస్తే, రవికాంత్ సీత "నా ప్రేమ నవ పారిజాతం" అంటూ ప్రేమ ఎప్పుడూ నవ పారిజాతమేనని చాటి చెప్పారు. నాగేశ్వరరావు శ్రీరాణి "సరిగమ పదనిస నస నస" అంటే, రవికాంత్ రీటా "వన్ టూ త్రీ ఫోర్" అంటూ ముక్తాయింపు నిచ్చారు.
మొత్తం మీద కార్యక్రమం అత్యద్భుతంగా అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ రాంబాబు సీత దంపతులు కార్యక్రమానికి విచ్చేసిన గాయనీ గాయకులందరినీ దుశ్శాలువలతో సన్మానించి తమ గొప్ప మనసును చాటుకొన్నారు.

126
5828 views