ఎక్సైజ్ అధికారులు దాడులు
బాపట్ల జిల్లా చినగంజాం లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు.ఈ దాడుల్లో స్థానిక అన్నపూర్ణ థియేటర్ వద్ద అక్రమంగా మద్యం అమ్ముతున్న అంకమ్మ రావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.అతని వద్ద నుండి 11 మద్యం బాటిల్లు స్వాధీనం చేసుకున్నారు.గ్రామాల్లో బెల్టు షాపులు నిర్వహిచి అక్రమ మద్యం అమ్మకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ అధికారులు హెచ్చరించారు.