వృద్ధాశ్రమంలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న ఎంపీ..
బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ పుట్టిన రోజు వేడుకలు చీరాల లో ఘనంగా జరుపుకున్నారు.చీరాల బోసునగర్ లోని
ఓ అనాధ వృద్దాశ్రమం లోని వృధులతో కలిసి ఎంపీ కృష్ణ ప్రసాద్ కేక్ కట్ చేసారు. అనంతరం ఆశ్రమంలోని వృద్ధులకు చీరలు దుప్పట్లు పంపిణీ చేసి అన్నదానం నిర్వహించారు.కన్న బిడ్డలకు దూరమై ఆశ్రమంలో ఉంటున్న వృధులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం మనస్సుకు ఎంతో తృప్తి నిచ్చిందని ఎంపీ కృష్ణ ప్రసాద్ అన్నారు.