
విజయ వంతమయిన గాన స్వరాభిషేకం
- నక్క రాజుకు ప్రశంసల జల్లులు
విజయ వంతమయిన గాన స్వరాభిషేకం
నక్క రాజుకు ప్రశంసల జల్లులు
జగిత్యాల:
మహా శివరాత్రి పర్వ దినాన్ని పురస్కరించుకుని డా. నక్క రాజు నిర్వహించిన 13 వ వసంతపు, 7వ 24 గంటల గాన స్వరాభిషేకం గురువారం విజయ వంతం అయింది.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని వాణి నగర్ లో గల అతి పురాతనమైన జవ్వాజి పుల్లయ్య శ్రీ రాజ రాజేశ్వర స్వామి ఆలయంలో డా.నక్క రాజు బుధవారం ఉదయం గంటలు 9-22 నిమిషాల నుండి గురు వారం ఉదయం 10-30 గంటల వరకు 24 గంటల నిర్విరామ గాన స్వరాభిషేకం నిర్వహించారు. వేద పండితులైన నంబి వాసుదేవా చార్యులు, ఆలయ అర్చకులు నవీన్ ల ఆశీర్వచనం తో ప్రారంభం అయింది. గురువారం పలువురు ఆధ్యాత్మిక ప్రముఖులు పాల్గొని నక్క రాజును అభినందిస్తూ, ప్రశంసల జల్లులు కురిపిస్తూ, శాలువాలతో ఘనంగా సత్కరించారు. ఆయన సేవలను, ఆధ్యాత్మిక, కళా, విద్యా, సమాజ సేవా రంగాలలో ఆయన కృషిని కొనియాడారు.
ఆలయ కమిటీ నిర్వహకులు జవ్వాజి సందీప్, జవ్వాజి వేణు గోపాల్, త్రిశూల్ యూత్ కమిటి కార్యవర్గం, రఘు, నేషనల్ ప్రెస్ క్లబ్ కౌన్సిల్ ఫార్మర్ మెంబర్ సిరిసిల్ల శ్రీనివాస్, ఆల్ ఇండియా మీడియా అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి జగిత్యాల - బుగ్గారం ప్రెస్ క్లబ్ ల అధ్యక్షులు ఎన్నం కిషన్ రెడ్డి, దూడ జీవన్, బోయిని పెళ్లి శ్రీధర్, గడ్డం రమేష్, లక్కరాజు లక్ష్మీ, అంగరి తార కిరణ్, రామారావు, రాఘవేంద్ర, చరణ్, సాయి, సునీల్, కళాకారులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.