
బుగ్గారంలో ....
అంగరంగ వైభవంగా సాంబ శివుని రథోత్సవం
స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
బుగ్గారంలో ....
అంగరంగ వైభవంగా సాంబ శివుని రథోత్సవం
స్వామిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
బుగ్గారం/ జగిత్యాల జిల్లా :
బుగ్గారం మండల కేంద్రంలోని సాంబుని గుట్ట వద్ద గల సంతాన సాఫల్య శ్రీ సాంబ శివ నాగేశ్వర ఆలయంలో గురువారం అంగరంగ వైభవంగా రథోత్సవం జరిగింది. మండలం తో పాటు వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, వివిధ పార్టీల నాయకులు, స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో లక్ష్మణ్ కుమార్ తో పాటు కాంగ్రెస్ పార్టీ, వివిధ పార్టీల ప్రముఖులను, నేతలను సత్కరించారు. హమాలీ సంఘం ఆధ్వర్యంలో చేసిన శుచి - రుచి కరమైన వంటకాలతో భక్తులకు, శివ దీక్షా స్వాములకు అన్నదానం చేశారు. ఒగ్గు కళాకారులు తమదైన శైలిలో నృత్య - కలా ప్రదర్షణలు నిర్వహించారు. శివ శక్తులు, శివ దీక్షా పరులు శివ తాండవంతో ఆలయం చుట్టూ రథాన్ని తిప్పుతూ భక్తులను ఎంతగానో ఆకట్టు కున్నారు. వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చిన ఆధ్యాత్మిక ప్రముఖులు, భక్తులు స్వామి వారిని దర్శించు కొని మొక్కులు తీర్చుకున్నారు. చిన్నారులు, మహిళలు, భక్తులు స్వయంగా స్వ హస్తములచే స్వామి వారి రథాన్ని లాగి సంతృప్తి చెందారు. కాగా బుధ వారం రాత్రి శివ పార్వతుల కళ్యాణం ఘనంగా నిర్వహించారు.