logo

ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో నారా లోకేష్ దంపతుల పుణ్యస్నానాలు

ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాలో పాల్గొన్నారు. సతీమణి నారా బ్రాహ్మణి, కుమారుడు నారా దేవాన్ష్‌తో కలిసి త్రివేణి సంగమం వద్ద షాహి స్నాన ఘట్టంలో పుణ్య స్నానం ఆచరించారు. అనంతరం గంగాదేవికి పూజలు చేసి, హారతులు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా నారా దేవాన్ష్‌తో కలిసి తీసుకున్న సెల్ఫీని సోషల్ మీడియాలో షేర్ చేశారు. మరోవైపు పుణ్యస్నానాల అనంతరం నారా లోకేష్ దంపతులు వారణాసిలోని కాలభైరవ ఆలయాన్ని సందర్శించారు.

0
154 views