logo

ప్రముఖ పత్రికా విలేఖరి మరియు TDP నాయకుడు పై క్రిమినల్ కేసు కొట్టివేత

*మచిలీపట్నం, కృష్ణా జిల్లా*

ప్రముఖ పత్రికా విలేకరి మరియు టిడిపి నాయకులు పై కేసు కొట్టివేత....... కృష్ణాజిల్లా ఎస్సీ మరియు ఎస్టి కేసుల విచారణ కోర్టు న్యాయమూర్తి తీర్పు.....

మచిలీపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో 2019 లో మచిలీపట్నం చెందిన ప్రముఖ దినపత్రిక విలేఖరి మరియు ఇద్దరు టిడిపి నాయకులు పై జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు పెట్టిన క్రిమినల్ కేసును కొట్టివేస్తూ కృష్ణాజిల్లా ఎస్సీ ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయమూర్తి జిల్లా జడ్జి చిన్నబాబు మంగళవారం తీర్పు చెప్పారు.

ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం గతంలో మచిలీపట్నం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సభ్యుని గా పనిచేసిన డాక్టర్ ఓట్రా విజయ నిర్మల 2019 మార్చి 9 వ తారీఖున మచిలీపట్నం కు చెందిన ప్రముఖ దినపత్రిక లో స్టాఫ్ రిపోర్టర్ గా పనిచేస్తున్న చిట్టా రవికుమార్ (45) తన ఫోను కు అసభ్యకరంగా అభ్యంతరకరంగా మెసేజ్లు పంపించి తనని అవమానపరిచారని మరియు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి డెవలప్మెంట్ కమిటీ సభ్యుడి గా పనిచేసిన బోయిన వెంకట కృష్ణంరాజు మరియు అతని తమ్ముడు బోయిన సతీష్ కలిసి తన మెడలో పసుపు తాడు కట్టి తిరిగి పసుపు తాడు తీసివేసి తనని అవమానపరిచారని డాక్టర్ విజయనిర్మల అప్పటి కృష్ణా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది.. డాక్టర్ విజయనిర్మల ఇచ్చిన ఫిర్యాదు పై నిందితుల ముగ్గురిపై అప్పటి మచిలీపట్నం డిఎస్పి మహబూబ్ బాషా ఐపీసీ 354 ఏ 509 మరియు 67 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ మరియు ఎస్సీ ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి చార్జీ దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో ప్రాసిక్యూషన్ తరపున 12 మంది సాక్షులను విచారణ చేశారు. కేసు విచారణ అనంతరం నిందితులపై నేర నిరూపణకు తగిన సాక్ష్యాలు ప్రవేశ పెట్టడంలో ప్రాసిక్యూషన్ విఫలం కావడంతో కేసు కొట్టివేస్తూ ముగ్గురు నిందితులను నిర్దోషులు గా విడుదల చేస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. నిందితుల తరఫున లంకిశెట్టి బాలాజీ, మహమ్మద్ రఫీ, మద్దాల సువర్ణ రాజు, కమ్మిలి విజయ్ కుమార్ న్యాయవాదులు గా వ్యవహరించారు...

10
2910 views