జనసేన ఆధ్వర్యంలో జనవాణి కార్యక్రమం
రాయలసీమ న్యూస్. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలో సోమవారంనాడు నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించారు. జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ధర్మవరం ఇంచార్జ్ చిలకం మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో వినతులు స్వీకరించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఏపీ మెడికల్ సర్వీసెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి మండలి రాజేష్, రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి, వీర మహిళ ప్రాంతీయ కో ఆర్డినేటర్ శ్రీమతి కోలా విజయ లక్ష్మి, లీగల్ సెల్ ప్రతినిధి శీలం నాగ వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.