logo

ప్రముఖ AIMA మీడియా జర్నలిస్ట్ , గాయకులు, స్వరబృందావనం వ్యవస్థాపకులు శ్రీ బృందావనం రవికాంత్ గారి రక్తదానం.

ఒకరి రక్తాన్ని మరియొకరికి ఇవ్వడాన్నే "రక్త దానం" అంటారు. ఇది కూడా "ప్రాణ దానం" లాంటిదే. ఇది అమ్మకం కాదు, దానం. నైతిక విలువలు పాటిస్తూ మానవత్వం ఉన్నవారు అవయవాలు, రక్తం దానం చేయడం.
ఒక లీటరు రక్తంలో 100 గ్రా. కంటె తక్కువ Hemoglobin ఉన్న వ్యక్తికి రక్తం ఎక్కించవలసిన అవసరం ఉంటుంది. ఇలాంటి అత్యవసర పరిస్థితిలో ఆపరేషన్ సమయంలో రోగికి రక్తం ఎక్కిస్తారు. మనం దానం చేసిన రక్తాన్ని వెంటనే ఉపయోగించరు. రక్తం లో ఉన్న భాగాలను ఉదాహరణకు ఎర్ర రక్త కణాలు, Platelets, Plasma మొదలైనవి వేరు వేరుగా శుద్ధిచేసి నిల్వ చేస్తారు. ప్రతి రోగికి అన్నీ అవసరం ఉండవు. ఏ రోగికి ఏది అవసరమైతే అవి ఉపయోగిస్తారు.
రక్త దానం వలన చాలా లాభాలు ఉన్నాయి. 1. అవసరమైన వారి ప్రాణాలను రక్షించవచ్చు. 2. మన రక్త పోటు తగ్గుతుంది. 3. గుండె పోటు ప్రమాదం తగ్గుతుంది. 4. అదనపు ఇనుము తగ్గుతుంది. 5. కొత్త రక్త కణాల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. 6. మానసికోల్లాసం కలుగుతుంది.
ప్రతి ఆరోగ్యవంతమైన వ్యక్తి ఆరు నెలలకు ఒకసారి రక్త దానం చేయవచ్చు. రక్త దానం తరువాత ప్రొటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవలసి ఉంటుంది. రక్త దానం వలన ఎదుటి వారి ఆరోగ్యాన్ని కాపాడడమే కాక మన ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి. అందుకే ప్రతి సంవత్సరం జూన్ 14 న "ప్రపంచ రక్త దాతల దినోత్సవం" నిర్వహిస్తున్నారు.
ఈ విషయాలన్నీ ఎంతో చక్కగా అవగాహన చేసుకున్న శ్రీ రవికాంత్ గారు ప్రతి ఆరు నెలలకు ఒకసారి తన రక్తాన్ని దానం చేస్తున్నారు. ఇప్పటికే 20 సార్లు దానం చేసిన వీరు 21 వ సారి దానం చేస్తూ ఉండడం ఈ క్రింది ఫొటో లో చూడవచ్చు. మంచి పనికి మనం కూడా సహకరిద్దాం. రక్త దానం పై అవగాహన పెంచుకుని ప్రచారం చేద్దాం.

195
11212 views