
రాయలసీమలో చేయి జారుతున్న జనసైనికులు
రాయలసీమ న్యూస్. జనసేన పది సంవత్సరాల క్రిందట ఆంధ్రప్రదేశ్లో ఇది ఒక పేరు మాత్రమే. కానీ ఇప్పుడు ఒక ముఖ్యమంత్రిని నియమించే స్థాయిలో పార్టీ అభివృద్ధి చెందడం జరిగింది. దానికి ప్రధాన కారణం జనసేన పార్టీ జాతీయ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ వారి ఆలోచన విధి విధానాలు ప్రజల్లోకి బలంగా వెళ్లడం పోటీచేసిన ప్రతి ఒక్కరూ గెలుపొందడం జరిగింది ఇంతవరకు బాగానే ఉంది కానీ. రాయలసీమలో మాత్రం జనసేన పార్టీ నాయకులకు గాని కార్యకర్తలకు గాని ఎటువంటి గుర్తింపు లేకపోవడంతో కొందరు జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి పార్టీని సీమలో నేతలను కార్యకర్తలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ మాత్రం జనసేన పార్టీ రాయలసీమ జోన్ కమిటీలను, సమన్వయకర్తలను అధినేత నియమించడం జరిగింది. వీరు మాత్రం టిడిపి తో చెట్టా పట్టా లేసుకొని తిరుగుతూ జనసేన కార్యకర్తలను పట్టించుకోని పాపాన పోలేదు. ఇలాగే అధ్యక్షులు వారు చూస్తూ ఉంటే అసలు రాయలసీమలో జనసేన నాయకులు కార్యకర్తలు టిడిపి కండువా కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారు ఏదిఏమైనా జనసేన అధ్యక్షులు ఇటువంటివి కట్టడి చేయకపోతే మాత్రం సీమలో తిప్పలు తప్పవు