రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ ఇళ్ల పై సౌర ప్రాజెక్టులు
రాష్ట్రంలో పీఎం సూర్యఘర్ యోజన ముఫ్త్ బిజిలి పథకం అమలు కానుంది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన 20 లక్షల కనెక్షన్లకు ఈ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక్కో ఇంటిపై 2 కిలోవాట్ల సౌర విద్యుత్ పలకలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. లబ్ధిదారులపై ఎలాంటి భారం పడకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ పథకాన్ని అమలు చేయనుంది.